ఇక పెప్సీ ధరించండి
ముంబై : పెప్సీ టీ-షర్ట్ ధరిస్తే ఎలా ఉంటుంది? లేదా 7అప్ లేదా మౌంటెన్ డ్యూ షర్ట్ ధరిస్తారా? లేకపోతే పెప్సీ సన్ గ్లాస్ ల జత పెట్టుకుంటే? ఇదంతా ఏమిటి అని ఆశ్చర్యపోకండి మరి. పెప్సీకో భారతదేశంలో దుస్తులు, అనుబంధ వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నది. లైసెన్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇండియాలో పెప్సీకో లైసెన్సింగ్, వస్తువుల వ్యాపారానికి నాంది పలుకుతున్నది.
'భారతీయ యువజనులతో తాదాత్మ్యం చెందిన ప్రసిద్ధ బ్రాండ్ పెప్సీ. దీనిని లైఫ్ స్టైల్ ఫ్యాషన్ బ్రాండ్ గా సులభంగా విస్తరించవచ్చు' అని ఇండియాలో పెప్సీ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ అధిపతి, లైసెన్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ శాలీ బార్నెస్ అన్నారు. ఫ్రాంచైజీ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థే లైసెన్స్ ఇండియా.
'ఉత్పత్తిని బట్టి ధరలు రూ. 200 నుంచి రూ. 1000కి పై స్థాయి వరకు శ్రేణిలో ఉంటాయి. ఇవి అందుబాటులో, ఆకర్షణీయంగా ఉండే ఉత్పత్తులు. నైకీ స్పోర్ట్స్ షూల ధర సుమారు రూ. 4000 ఉండగా పెప్సీ స్పోర్ట్స్ షూలు వెయ్యి రూపాయలకే లభిస్తే ఎలా ఉంటుందో ఊహించండి' అని బార్నెస్ అన్నారు.
News Posted: 18 September, 2009
|