భారతీయ సంతతి కళకళ
న్యూయార్క్: కలకాలం పచ్చగా కళకళలాడుతూ ఉండాలి అనే దీవెన మనుష్యులకే కాదు... సంస్థలకూ వర్తిస్తుంది. పర్యా వరణ పరిరక్షణ భావనకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అనేక అమెరికన్ కంపెనీలు తమ ఉత్పాదనలను, తయరీకేంద్రాలనూ పర్యావరణ స్నేహపూర్వకంగా తీర్చిదిద్దుతున్నాయి. ఇలాంటి 500 అమెరికన్ కంపెనీల జాబితాను న్యూస్‌వీక్ మ్యాగజైన్ ప్రచురించింది. భారత సంతతి నేతృత్వంలోకి ఆరు కంపెనీలు ఇందులో ఉండడం విశేషం.
వీటిలో మూడు టాప్ 50లో చోటు సాధించాయి. అడోబ్ సిస్టమ్స్ (శాంతను నారాయణ్) 16వ స్థానం, మోటారోలా (సంజయ్ ఝా) 21వస్థానం, సిటీ (విక్రమ్ పండిట్) 24వ స్థానంలో నిలిచాయి. ఇంద్రానూయి నేతృత్వంలోని పెప్సీకో 119వ స్థానం పొందింది. హార్ట్‌ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (రమణి అయ్యర్), కాగ్నిజెంట్ టెక్నాలజీ (ఫ్రాన్సిస్కో డిసౌజా) సంస్థలు వరుసగా 303, 449 స్థానాలు పొందాయి. జాబితా మొత్తం మీద హెచ్‌పీ ప్రథమస్థానంలో నిలిచింది. డెల్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. జాన్సన్ అండ్ జాన్సన్ మూడో స్థానంలో నిలిచింది.
News Posted: 24 September, 2009
|