12 లక్షలకు టాటా హోమ్
ముంబాయి : సగటు భారతీయుడికీ నానో పేరిట కార్లను అందుబాటులోకి తీసుకువచ్చిన టా టాలు తాజాగా ఇళ్ళనూ అందుబాటులోకి తేనున్నారు. ముంబాయిలో టాటా హౌసింగ్ డెవలప్ మెంట్ కంపెనీ ‘న్యూ హవెన్’ పేరిట ను ప్రవేశపెట్టింది. ముంబాయి లోని బోయిసర్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 1,300 అపార్ట్‌మెంట్స్‌లను ఇందులో ఆఫర్ చేస్తోంది. వీటి ధర లు రూ.12.73 లక్షలతో మొదలవుతాయి. రెండు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. కనీస పరిమాణం 670 చదరపు అడుగులు. ఈ ప్రాజెక్టు 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. స్విమ్మింగ్ పూల్, క్లబ్‌హౌస్, కమ్యూనిటీ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి సదుపాయాలుంటాయి.
News Posted: 24 September, 2009
|