వైజాగ్ స్టీల్ కు గోదావరి
హైదరాబాద్: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీంతో కర్మాగారం గోదావరి జలాలను వినియోగించుకోవడానికి రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. ఈ నీటి వనరులను స్టీల్ ప్లాంట్‌కు తరిలిచండం వ్యయంతో కూడుకున్న పని కావడంతో, స్టీల్ ప్లాంటే స్వయంగా గోదావరి నుంచి నీటిని తరలించుకోవడానికి ముందకు వచ్చింది. దీనికి అవసరమైన ఇతర అనుమతులను తీసుకోవడానికి నీటిపారుదల శాఖను ఆదేశిస్తూనే, అవసరమైన ప్రతిపాదనలు పంపించవలసిందిగా సిఎం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అధికారులను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రమాకాంత్ రెడ్డి సంక్షంలో జరిగిన సమావేశంలో కేంద్ర స్టీల్ కార్యదర్శి రస్తోగి, పరిశ్రమల శాఖ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖ స్టీల్స్‌కు రెండోవ దశతో కలుపుకుంటే రోజుకి 73 మిలియన్ గ్యాలెన్ల నీరు(ఎంజిడి) అవసరం. గతంలోనే విశాఖ స్టీల్ నీటి వనరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నుంచి ఐదు టిఎంసీలు, ఏలేరు రిజర్వయర్ నుంచి ఐదు టిఎంసీలు వినియోగించుకోవడానికి కేటాయించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏలేరు రిజర్వుయర్ నుంచి రెండు టిఎంసీలు నీటిని మాత్రమే ప్రతి రోజు స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలకు సరఫరాచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నీటి సరఫరా సంస్థ 24 ఎంజిడి నీటిని మాత్రమే స్టీల్ ఫ్యాక్టరీకి అందిస్తున్నది. ఇది ఏమాత్రం స్టీల్ ప్లాంట్ అవసరాలను తీర్చడం లేదు. ఉత్పత్తి కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.వచ్చే ఏడాది నాటికి స్టీల్ ప్లాంట్ రెండోవ దశ విస్తరణ పనులు కూడా పూర్తి అవుతాయని, అందుచేత ప్రభుత్వం దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్టీల్ కార్యదర్శి రాస్తోజి అధికారులను కోరారు. విశాఖ స్టీల్ రెండోవ దశను రూ. తొమ్మిది వేల కోట్లతో చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం 8 మిలియన్ టన్నుల ఉంచి 12 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
News Posted: 25 September, 2009
|