బెంగళూరు : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వంటి వారితో ఒక రోజంతా గడిపితే ఎలా ఉంటుంది. కానీ ఇలాంటి అవకాశం అందరికీ దొరకదు కదా. అయితే 'షాడో సీఈఓ' కార్యక్రమం కింద ఈ అవకాశాన్ని ఇండియన్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) విద్యార్థులు దొరకబుచ్చుకున్నారు. వారికి ఈ అవకాశాన్ని'గివ్ ఇండియా ఫౌండేషన్' కల్పించింది. 'జాయ్ ఆఫ్ గివింగ్ వీక్' పేరిట జరిగే ఉత్సవంలో 26 మంది వ్యాపార వేత్తలు పాల్గొంటారు. ఇందులో బిడ్ గా అధిక మొత్తం నారాయణ మూర్తికే దక్కింది. ఆ మొత్తం విలువ లక్ష రూపాయలు. ఆయన తర్వాత స్థానం కుమార మంగళంకు దక్కింది. కానీ ఆ విలువ ఎంత అన్నది తెలపలేదు. సెప్టంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో చివరి పన్నెండు గంటల్లో అధికంగా బిడ్లు వచ్చాయి. మొత్తం ఈ కార్యక్రమానికి 1196 బిడ్లు దాఖలయ్యాయి. ఏఏ బిడ్డర్లు సీఈఓలతో గడిపేది వచ్చే వారంలో నిర్ణయం కానుంది.