బీఎస్‌ఎన్‌ఎల్ పండగ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ నూతన టారిఫ్ స్కీమ్‌ను ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 దాకా చేసే లోకల్ కాల్స్‌కు నిమిషానికి 20 పైసలు, ఎస్టీడీకీ నిమి షానికి 50 పైసలు ఛార్జ్ చేయనున్నారు. జిఆర్‌పీఎస్ ప్లాన్ కింద రూ. 230 అపరిమిత డేటా యూసేజ్‌ను అందించనున్నారు. రెండు ఎస్‌ఎంఎస్ ప్యాకేజీలను కూడా బీఎస్ ఎన్‌ఎల్ ప్రకటించింది. రూ. 30 చెల్లిస్తే, అన్ని లోకల్, నేషనల్ మెసేజ్‌లకు 10 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు. రూ. 50 చెల్లిస్తే, 300 లోకల్, నేషనల్ మెసేజ్‌లు ఉచితంగా పొందవచ్చు. లోకల్ కాల్స్‌కు సెకనుకు ఒక పైసా, ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు 2 పైసల స్కీమ్‌ను కూడా (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాలలో) బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.
News Posted: 3 October, 2009
|