పెరగనున్న జీతాలు
హాంగ్ కాంగ్ : భారతదేశంలో ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగిపోతాయట! 2010 నాటికి పెద్ద పెద్ద వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయని ఒక సర్వేలో తేలింది. ఆసియా ఖండంలోని అన్ని దేశాలు ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి త్వరితగతిని కోలుకుంటూ ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. భారతదేశంలో ఈ పెరుగుదల మూలవేతనంపై పది శాతం ఉంటుందని అంచనా వేశారు. హేవిట్ అసోసియేట్స్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఇండోనేసియా, చైనాల్లో ఈ పెరుగుదల 8.7, 6.7 శాతాలుగా ఉండబోతున్నాయి. జపాన్ మాత్రం కేవలం 2.1 శాతం పెరుగుదలను మాత్రమే ఇవ్వబోతోంది. స్థానిక కంపెనీలు, సంయుక్త భాగస్వామ్య కంపెనీలలో వేతనాలను గురించి ఈ అధ్యయనం చేసారు.
News Posted: 21 October, 2009
|