'ఆహార ధరలు తగ్గుతాయి'
న్యూఢిల్లీ : ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి తగ్గగలదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం సూచించారు. ఢిల్లీలో 'ఇండియా ఎకనామిక్ సమ్మిట్'లో డాక్టర్ అహ్లువాలియా ప్రసంగిస్తూ, 'ఆహార పదార్థాల ధరల ద్రవ్యోల్బణం ఇప్పుడున్న స్థాయి కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సారాంతానికి గణనీయంగా తగ్గిపోగలదు' అని భరోసా ఇచ్చారు.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండడానికి కారణాలను ఆయన వివరిస్తూ, వర్షాలు తగినంతగా కురవకపోవడం వల్ల ఆ ప్రభావం ఆహార పదార్థాల ధరలపైన, ముఖ్యంగా కూరగాయల ధరపైన పడిందని చెప్పారు. కూరగాయల ధరలు రానున్న మాసాలలో తగ్గవచ్చునని ఆశిస్తున్నట్లు డాక్టర్ అహ్లువాలియా చెప్పారు.
News Posted: 9 November, 2009
|