పసిడి పడింది
ముంబయి : రికార్డులు సృష్టిస్తూ ఎగిరిపోతున్న పసిడి ధరల రెక్కలను దుబాయి సంక్షోభం కట్టేసింది. పది గ్రాముల బంగారం ధర 18 వేల రూపాయలకు చేరుపోతుందని భావించిన వారి ఆశలు ఒమ్మయ్యాయి .ముంబయి బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరులు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గిపోవడం, రూపాయి విలువ స్వల్పంగా పతనం కావడంతో అమెరికన్ డాలర్ పుంజుకుంది. స్వచ్చమైన బంగారం ధర పదిగ్రాములకు 270 రూపాయలు తగ్గి 17,705 రూపాయలకు చేరింది. స్టాండర్డ్ బంగారం ధర 275 రూపాయలు తగ్గి 17,615 రూపాయలుగా ఉంది. వెండి ధర కేజీకి 490 రూపాయలు తగ్గి 28 వేల 775 రూపాయలకు చేరింది.
News Posted: 27 November, 2009
|