ధర తగ్గిన పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధర దారుణంగా పడిపోయింది. ఈ సంవత్సరంలో పెరుగుటే కాని విరుగుట లేని పసిడి గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు ధగధగలు కొల్పోయింది. డిసెంబర్ మూడో తేదీ నాటికి పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 18,550 రూపాయలకు చేరింది. పెళ్ళిళ్ల సీజన్, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ ల ప్రకారం ఇరవై వేల మార్కును చేరిపోతుందని నిపుణులు అంచనా వేశారు. రూపాయి విలువ పడిపోతున్న దశలో బంగారం కొనడం ద్వారా తమ డబ్బు నిల్వల విలువను కాపాడుకోవచ్చనే ఆశతో మదుపర్లు భారీ స్థాయిలో కొనుగోళ్లు చేసారు. కానీ బుధవారం బంగారం ధర ఒక్కసారిగా 440 రూపాయలు పడిపోయి 17 వేల 360 రూపాయలకు చేరింది. గత శనివారం ఉదయం 18,550 రూపాయలుగా ఉన్న ధర సాయంత్రానికి 510 రూపాయలు తగ్గి ఈ సంవత్సరంలో మొదటిసారి పతనాన్ని సూచించింది. దీని ప్రకారం వారం రోజుల్లో బంగారం ధర 1,260 రూపాయలు తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది.
News Posted: 9 December, 2009
|