యాహూకు సెలవు
న్యూయార్క్ : యాహూ.. ఇంటర్నెట్ దిగ్గజం.. ప్రపంచంలోని తన కార్యాలయాలన్నింటినీ వారం రోజుల పాటు మూసేయనున్నది. ఆర్ధికమాంద్యం కాలంలో క్రిస్ మస్ పండుగ ఈ కంపెనీకి వరంలా దొరికింది. డిసెంబర్ 25 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ యాహూ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నామని, ఖర్చును తగ్గించుకునే చర్యల్లో ఇది భాగమని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే యాహూ 'అన్ని అత్యవసర సేవలను కొనసాగిస్తుంద'ని వివరించింది.
యాహూ ఒక్కటే కాదు. ఎడోబ్, యాపిల్ వంటి కంపెనీలు కూడా పండగలను పురస్కరించుకుని డిసెంబర్ 24 నుంచి జనవరి ఒకటో తారీకు వరకూ తమ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకోడానికి ఉన్న అన్ని మార్గాలను ఈ కంపెనీలు అన్వేషిస్తున్నాయని యాహూ అధికార ప్రతినిధి డానా లెంగ్కీక్ చెప్పారు. పండగ సమయంలో ఎలాగైన పని తక్కువగా సాగుతుందని, అందువలన సెలవులు ఇస్తే ఉద్యోగులు మరింత ఉత్సాహంతో తిరిగి విధుల్లోకి వస్తారని ఆయన అన్నారు. అదే సమయంలో ఖర్చు ఆదా అవుతుందని వివరించారు. యాహూ ఇప్పటికే ఏడు వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
News Posted: 22 December, 2009
|