భత్యాలపై పన్ను కొత్త కాదు
న్యూఢిల్లీ : ఉద్యోగులు తమకు అదనంగా లభించే భత్యాలపై పన్నులు చెల్లించాలని కోరడం కొత్త విషయం కాదని, 'అదనపు ప్రయోజనాల పన్ను' (ఎఫ్ బిటి)కి ముందు కూడా ఇటువంటి ప్రోత్సాహకాలు పన్ను పరిధిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం వివరించింది.
'నాకు తెలిసినంత వరకు అదనపు ప్రయోజనాల పన్నుకు ముందు కూడా ఉద్యోగులకు అదనపు భత్యాలపై పన్ను విధింపు జరుగుతున్నది. అందువల్ల ఈ పరిణామం కొత్తేమీ కాదు' అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా మంగళవారం న్యూఢిల్లీలో విలేఖరులతో చెప్పారు.
వేతనాలు అందుకునే ఉద్యోగులకు కల్పిస్తున్న వసతి, కన్వేయన్స్ వంటి భత్యాలను వారి పన్ను మదింపునకు లెక్కలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం సోమవారం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ ప్రతిపాదన 2009 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.
'అదనపు భత్యాలపై పన్ను విధించే బాధ్యతను ఎఫ్ బిటి యజమానులకు బదలాయించింది. ఇప్పుడు ఈ విధానం తిరిగి మారింది. ఎఫ్ బిటి అనేదే లేదు. అందువల్ల గతంలో వలె ఉద్యోగులే పన్ను చెల్లించవలసి ఉంటుంది' అని చావ్లా వివరించారు.
News Posted: 23 December, 2009
|