గూగుల్ మొబైల్ నెక్సస్
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఐఫోన్ కంపెనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గూగుల్ మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించింది. మంగళవారం నాడు తాను తయారు చేసిన కొత్త ఫోన్ 'నెక్సస్' ను మార్కెట్లోకి వదిలింది. రాబోయే సంవత్సరాల్లో ఇంటర్నెట్ రంగంలో ఈ ఫోన్ తన హవాను సృష్టిస్తుందని నిపుణులు జోస్యం చెబుతున్నారు. గూగుల్ గతంలో మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించి ఇచ్చింది. దీనిని శాంసంగ్, మోటరోలా, హెచ్ టిసి కంపెనీలు తమ మొబైల్ హండ్ సెట్లలో వినియోగించుకున్నాయి.
వినియోగదారులకు సరాసరి విక్రయించడానికి గూగుల్ నెక్స్ స్ బ్రాండ్ తో మొబైల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. నెక్సస్ వెబ్ అవసరాలకు సరీగ్గా సరిపోయే ఫోన్ అని గూగుల్ అభివర్ణించింది. దీనిలో అండ్రాయిడ్ కొత్త వెర్షన్ ఉందని, 9.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఉందని గూగుల్ ప్రతినిధి మారియో క్వెరోజ్ తెలిపారు. హెటిసి సంయుక్త భాగస్వామ్యంతో తయారు చేసిన ఈ ఫోన్ లో ఒక గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, ఐదు మోగా ఫిక్సల్ కెమెరా ఉంటుందని, 11.5 మిల్లీ మిటర్ల మందంతో ఉండే నెక్స్ స్ బరువు 130 గ్రాములని ఆయన వివరించారు.
News Posted: 6 January, 2010
|