3జితో 25 వేల కోట్లు
కొయంబత్తూర్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్ పోన్ లకు ఉపయోగపడే థర్డ్ జనరేషన్ రేడియో తరంగాలు(3జి స్పెక్ట్రమ్) వేలం గాని జరిగితే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి ఎ రాజా చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో వేలం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ప్రైవేట్ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు ఒన్ టైమ్ చెల్లింపు గా ఇచ్చే మొత్తం పాతిక వేల కోట్ల రూపాయలు గా ఉంటుందనే అంచనా ఉందని తెలిపారు. 3జి ద్వారా ప్రభుత్వానికి 35 వేల కోట్ల రూపాయల ఆదాయం చేకూరవచ్చని ఆయన చెప్పారు. ఇక్కడ బిఎస్ఎన్ ఎల్ 3జి సర్వీసులను మంత్రి రాజా శనివారం ప్రారంభించారు. 4జి గురించి ప్రస్తావించగా ప్రస్తుతానికి సాంకేతిక లోపాలు ఉన్నందున అంతర్జాతీయ టెలికాం యూనియన్ దానిని తిరస్కరించిందని వివరించారు.
News Posted: 23 January, 2010
|