టాబ్లెట్ ఐప్యాడ్
శాన్ ఫ్రాన్సిస్కో : ఏపిల్ అభిమానుల కోర్కెను స్టీవెన్ పి. జాబ్స్ ఎట్టకేలకు తీర్చారు. 'ఐప్యాడ్'గా పైర్కొనే కొత్త ఐఫోన్ వంటి టాబ్లెట్ కంప్యూటర్ ను ఆయన ముందుగా యుఎస్ మార్కెట్ లో ప్రవేశపెట్టారు. దీని ఖరీదు 499 డాలర్లు. 'మ్యాజికల్, విప్లవాత్మకమైన ఉతప్తిని బుధవారం మార్కెట్ లోకి తీసుకురావడం ద్వారా 2010కి నాంది పలకాలని మేము ఆకాంక్షించాం' అని ఏపిల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవెన్ జాబ్స్ తెలియజేశారు. అయితే, కొందరు విశ్లేషకులు ఊహిస్తున్న ధర వెయ్యి డాలర్లు కన్నా దీని ప్రాథమిక ధర బాగా తక్కువగా ఉన్నది. అత్యంత అధునాత మోడల్ 64 గిగాబైట్ల మెమొరీతో, 3జి సెల్ ఫోన్ నెట్ వర్క్ కు అనుసంధానంతో 829 డాలర్లకు లభ్యం కాగలదు.
ఈ ఐప్యాడ్ పరిమాణం ఏపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ కన్నా పెద్దది. కాని డిజైన్ లో సారూప్యం ఉన్నట్టిది. ఈ ఐప్యాడ్ 'ఒక ల్యాప్ టాప్ కన్నా ఎక్కువ సన్నిహితమైనది, ఒక స్మార్ట్ ఫోన్ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టిది. ఇది అత్యంతాశ్చర్యకరమైన, భారీ డిస్ప్లేతో కూడుకున్నట్టిది' అని జాబ్స్ అభివర్ణించారు.ఐప్యాడ్ లక్షణాలు, రూపురేఖల గురించి చాలా నెలలుగా ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి 9.7 అంగుళాల స్క్రీన్, దాదాపుగా పూర్తి కీబోర్డు ఉన్నాయి. ఇది అరంగుళం మందంతో ఉన్నది. బరువు 680 గ్రాములు. అంతేకాకుండా, ఐప్యాడ్ స్క్రీన్ మల్టీటచ్ విధానంతో కూడుకున్నట్టిది. అంటే వేళ్లను అటూ ఇటూ కదిలించి ఈ స్క్రీన్ పై అంశాలను మార్చవచ్చు.
ఐప్యాడ్ కు వై-ఫై, బ్లూటూత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. ఇది ఒక గిగాహెర్ట్ జ్ ఏపిల్ ఎ4 చిప్ ను శక్తి స్వీకరిస్తుంది. ఇది 16 నుంచి 64 గిగాబైట్ల ఫ్లాష్ స్టోరేజ్ శక్తి గలది. ఈ ఐప్యాడ్ ఆవిష్కరణ సమయంలో స్టీవ్ జాబ్స్ వీడియో వీక్షణం, సంగీతం వినడం, ఇ-బుక్స్ పఠనం, ఫోటోల బ్రౌజింగ్, క్రీడలు ఆడడం వంటి కార్యకలాపాలకు వేదికగా ఉపయోగపడగలదని ప్రదర్శన రూపంలో వివరించారు.కాగా, ఐఫోన్ కు సంబంధించిన, సుమారు లక్ష వరకు ఉన్న ప్రస్తుత కేటలాగ్ అప్లికేషన్లు అన్నిటికీ ఐప్యాడ్ ఉపయోగిస్తుందని ఏపిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ ఫోర్ స్టాల్ తెలియజేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కార్యక్రమంలో ఐప్యాడ్ కు అనువైన కొత్త సాఫ్ట్ వేర్ ను ప్రదర్శించిన ఇతర భాగస్వామ్య సంస్థలలో గేమ్ డెవలపర్ 'గేమ్ లాఫ్ట్', 'ఎలక్ట్రానిక్ ఆర్ట్స్', 'ది న్యూయార్క్ టైమ్స్' కూడా ఉన్నాయి. గేమ్ లాఫ్ట్' ఐప్యాడ్ పై ఒక షూటర్ గేమ్ ను ప్రదర్శించింది.
ఏపిల్ సంస్థ ఇటువంటి టాబ్లెట్ కంప్యూటర్ రూపకల్పన కోసం ఒక దశాబ్దం పైనుంచి కృషి చేస్తున్నదని సంస్థ మాజీ ఉద్యోగులు పలువురు తెలియజేశారు.
News Posted: 28 January, 2010
|