మహేష్ 'థండర్' ఫీట్
కౌలాలంపూర్: సూపర్ స్టార్ మహేష్ బాబు 'చాలా ఇంకా కావాలా' అంటూ 'యూనివర్ సెల్' మొబైల్స్ కోసం చేసిన డేర్ డెవిల్ స్టంట్స్ తరహాలోనే ఇప్పుడు థమ్స్ అప్ కోసం మరిన్ని సాహసోపేతమైన స్టంట్స్ చేసి అబ్బురపరచనున్నారు. సమ్మర్ ట్రీట్ గా ఈ సరికొత్త కమర్షియల్ జనం ముందుకు రాబోతోంది. 'నేను నా థమ్స్ అప్ కోసం ఏదైనా చేయబోతున్నాను' అనేది ఇందులో మహేష్ కాన్సెప్ట్. ఇందులో ఆయన ఒక భవంతి నుంచి మరో భవంతిపైకి దూకడం, మలేసియాలోని 500 అడుగులు ఎత్తున్న బ్రిడ్జి నుంచి 'హయబుసా' అనే ఫ్రెంచ్ స్పోర్ట్ బైక్ నుంచి జంప్ చేయడం వంటి డేర్ డెవిల్ ఫీట్స్ ఉండబోతున్నాయి. ఈ వీరోచిత విన్యాసాలను ఇటీవలే కౌలాలంపూర్ లో చిత్రీకరించారు. థమ్స్ అప్ లవర్ గా దానిని చేక్కించుకునేందుకు ఆయన ఈ సాహస విన్యాసాలు చేస్తారు.
'ఇదొక గేమ్ లా సాగుతుంది. నా థమ్స్ అప్ ను చేజిక్కుంచుకోవాలని ఓ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. దాన్ని తెలివిగా దక్కించుకునేందుకు నేను చురుగ్గా పావులు కదుపుతుంటాను. కావాల్సినంత యాక్షన్, అడ్వెంజర్, నవ్వుతెప్పించే కోణం ఈ యాడ్ లో మిళితమై ఉంటుంది' అంటూ థమ్స్ అప్ లవర్స్ ను మహేష్ మరింత ఊరిస్తున్నారు.
News Posted: 10 February, 2010
|