| రివర్స్ గేర్ లో లక్ష ఎ-స్టార్లుముంబయి : ఫ్యూయల్ పంప్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో లక్ష  ఎ స్టార్ మోడల్ కార్లను వెనక్కి రప్పించాలని మారుతీ సుజకీ నిర్ణయించింది. 2009 ఆగష్టు నెల వరకు తయారైన ఎ స్టార్ కార్లకు ప్యూయల్ కిట్ లను మార్పు చేసి ఇవ్వాలని  ఆ సంస్థ నిశ్చయించింది.   ఫ్యూయల్ పంప్ లో  సాంకేతిక లోపాలున్నట్లు మారుతీ చేపట్టిన అంతర్గత సర్వేలోబయల్పడింది. దీంతో ఫ్యూయల్  లీకేజీలు జరగకుండా మారుతీ ముందు జాగ్రత్త చర్యగా పంప్ లను మారుస్తోంది.
 
 మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) సంస్థ 2008 నవంబరు 19న  తన ఐదో అంతర్జాతీయ మోడల్ గా  ఎ- స్టార్ కారును మర్కెట్లోకి ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో లక్ష వరకు  ఈ మోడల్ కార్లను విక్రయించింది. యూరప్, దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,  సౌదీ అరేబియా, మోరాకో, అర్గేరియా, యుఎఈ, చిలీ వంటి 70 దేశాల్లో జోరుగా  విక్రయాలు సాగించింది. గత డిసెంబరు మాసం నాటికి ఎ- స్టార్  మోడల్ కార్లు ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు లక్షను దాటాయి. సక్సెస్ మోడల్ కారు కావడంతో మారుతీ ఎ - స్టార్ నాణ్యతా ప్రమాణాలపై శ్రద్ధ చూపింది. వినియోగదారుల నుంచి అభిప్రాయాలు కోరుతూ సర్వే చేపట్టింది. వివిద ప్రాంతాల నుండి పలువురు చేసిన ఫిర్యాదులు, సూచనలను క్రోడీకరించి విశ్లేషించిగా  ఎ - స్టార్ మోడల్ కు ప్యూయల్ పంప్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు ఆ సంస్థ నిపుణులే పసిగట్టారు. వెనువెంటనే ఎ- స్టార్ లో ప్యూయల్ పంప్ లోపం ఉందని, తమ అధీకృత కేంద్రాలకు కారును తెస్తే పంప్ ను మారుస్తామంటూ   కొనుగోలుదారులకు లేఖల ద్వరా సమాచారం పంపింది.
 
 గత డిసెంబరు మాసం నుండి ఇప్పటివరకు 50, 000  కార్లకు ప్యూయల్ పంప్ లను మార్చినట్లు మారుతీ సుజుకీ అదికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గత ఏడాది ఆగస్టు 11 తేదీ వరకు అమ్మిన అన్ని కార్లను వెనక్కి తేవాలని వినియోగదారులను కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఫ్యూయల్ పంప్ లో లోపం ఉన్నప్పటికీ ఇప్పటివరకు వినియోగదారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా, తామే బాధ్యతగా తీసుకుని పంప్ మారుస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను వినియోగదారుల నుండి ఎటువంటి డబ్బును వసూలు చేయడం లేదని ఆయన చెప్పారు. తమ కంపెనీకి ఫ్యూయల్ పంప్ సరఫరా చేసిన భాగస్వామి, తామే ఈ  వ్యయ భారాన్నిభరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
 
 కాగా,  జపనీకి చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ హోండా  రూపొందించిన 'సిటీ' మోడల్ లో 8, 532 కార్లకు  విండో స్విచ్ లోపాన్ని గుర్తించింది. ఈ మేరకు లోపాన్ని సరిదిద్దేందుకు కార్లను వెనక్కి తీసుకురావాలంటూ ఆ సంస్థ కూడా  నెల రోజుల క్రితం కొనుగోలుదారులను కోరింది. హోండా కంపెనీ  ఇండియా అధీకృతమైన సియల్ కార్స్ ఇండియా సంస్థ కూడా రెండో విడతలో భాగంగా 2007లో ఉత్పత్తి చేసిన కార్లకు కొన్ని బాగాలను మార్పు  చేసింది.
 
 
 
 
 News Posted: 23 February, 2010
 
 
 
 
 
 |