హైడెఫినిషన్ టివి ప్రసారాలు
ఢిల్లీ: 1982 ఆసియా క్రీడోత్సవాల వల్ల దేశంలోని వీక్షకులకు రంగుల టివి కార్యక్రమాలు చూసే అవకాశం కలిగింది. వచ్చే సంవత్సరం జరగనున్న కామన్వెల్త్ క్రీడోత్సవాలు కొత్త తరం టివి వీక్షణకు అవకాశం కలిగించనున్నాయి. 'హై డెఫినిషన్ టెలివిజన్' (హెచ్ డిటివి) ప్రసారాలను ప్రారంభించాలని దూరదర్శన్ (డిడి) యోచిస్తున్నది. దీని వల్ల మామూలు టెలివిజన్ కన్నా 16 రెట్లు స్పష్టంగా దృశ్యాలు వీక్షకులకు కనిపిస్తాయి.
హెచ్ డిటివిలో కామన్వెల్త్ క్రీడోత్సవాల ప్రసారానికి గాను నాలుగు మెట్రో నగరాలలో స్టూడియోల నిర్మాణానికి అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర మంత్రివర్గాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాక కోరింది. బిబిసి, స్కై స్పోర్ట్స్ ఇప్పటికే హెచ్ డిటివి పద్ధతిలో ప్రసారాలను చేస్తున్నాయి. ఈ క్రీడోత్సవాలకు హక్కులు సంపాదించిన బ్రాడ్ కాస్టర్లకు హెచ్ డిటివి పద్ధతిలో సిగ్నల్ ను సమకూరుస్తారు. 'దేశ, విదేశాలలో కేబుల్, శాటిలైట్ కేంద్రాల ద్వారా ఇళ్ళలో హెచ్ డిటివి పిక్చర్ ప్రసారం చేయవచ్చు' అని దూరదర్శన్ అధికారి ఒకరు పేరు వెల్లడి చేయరాదనే షరతుపై చెప్పారు. ఎందుకంటే మీడియాతో మాట్లాడేందుకు ఆయనకు అధికారం ఇవ్వలేదు.
Pages: 1 -2- News Posted: 11 February, 2009
|