'టి' కమిటీలో సమైక్య మసాలా!
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేయ తలపెట్టిన సంయుక్త సభా సంఘం (జెహెచ్ సి)లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి నిశ్చయించారు. ఆయన వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం ఇతర వెనుకబడిన ప్రాంతాలను ప్రోత్సహించడం ద్వారా పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చవచ్చు.
రాజకీయ పార్టీల ప్రాతిపదికపై కాకుండా వివిధ ప్రాంతాల నుంచి జెహెచ్ సిలోకి సభ్యులను ఎంపిక చేస్తారు. దీని వల్ల రాజకీయ పార్టీల సంఖ్యాపరంగా కమిటీలో బలాన్ని కోల్పోవచ్చు. ఇది మరొక వివాదానికి దారి తీయవచ్చు. తెలంగాణ ప్రాంతంతో పాటు హైదరాబాద్, ఉత్తర ఆంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ఇద్దరు ముగ్గురు సభ్యులను కమిటీలో నామినేట్ చేస్తారు.
'తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిపై గతంలో ఎన్నడూ 70 లక్షల మంది హైదరాబాదీలకు అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఇవ్వలేదు' అని ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ప్రతినిధి ఒకరు చెప్పారు. 'ముస్లింలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడినవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిటీలో హైదరాబాద్ కు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు' అని ఆ ప్రతినిధి తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే అభ్యర్థన కూడా వస్తున్నది.
Pages: 1 -2- News Posted: 15 February, 2009
|