రాహుల్ కాదు, సింగే మా కింగ్!
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీకి, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కి సారథ్యం వహించేది డాక్టర్ మన్మోహన్ సింగే కాని రాహుల్ గాంధీి కాదని కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ప్రకటించింది. ఈ విషయమై సాగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో పార్టీ తెర దించినట్లయింది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి కపిల్ సిబల్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. 'రాహుల్ ప్రభుత్వ సారథ్యాన్ని ఎప్పుడు స్వీకరించాలో నిర్ణయించవలసింది కాంగ్రెస్ అధిష్ఠానమే. మన్మోహన్ సింగ్ మా ప్రధాని. మా ప్రధానిగా ఆయనతో కలసే ఎన్నికలలో పాల్గొనబోతున్నాం' అని కపిల్ సిబల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే, అమేథి ఎంపి రాహుల్ గాంధి అధికారాన్ని చేపట్టడానికి తన నాయనమ్మ ఇందిరా గాంధి మార్గాన్నే అనుసరించవచ్చునని, బహుశా ఆయన ముందు మన్మోహన్ సింగ్ 'కింద' మంత్రిగా 'పని' చేయవచ్చుని పార్టీ వర్గాలు సూచించాయి. ఆయన ఆ ఉన్నత పదవిని నేరుగా చేపట్టబోరని ఆ వర్గాలు తెలిపాయి. 'కాంగ్రెస్ 160-170 సీట్ల సంఖ్యను దాటినప్పటికీ ఆయన అలా చేయరు' అని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ 145 సీట్లను గెలుచుకున్నది.
Pages: 1 -2- -3- News Posted: 19 February, 2009
|