రాజకీయం రెండో ఇన్నింగ్స్!
న్యూఢిల్లీ : దేశంలో క్రికెట్ నిర్వహణ విషయానికి వచ్చేసరికి రాజకీయ నాయకులు భారతీయ క్రికెటర్లను వెనుకకు నెట్టేస్తుంటారు. కాని రాజకీయాలలోకి మాత్రం రెండు చేతులూ జాపి మరీ ఆహ్వానిస్తుండడం విచిత్రం. రాజకీయ ప్రపంచంలో కాలు మోపుతున్న ప్రముఖ క్రికెటర్లలో మహమ్మద్ అజహరుద్దీన్ ఒకడు. కాని ఆట నుంచి రిటైరైన తరువాత రాజకీయాలపై ఆసక్తి కనబరిచిన మొదటి క్రికెటర్ మాత్రం అజహర్ కాడు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం మన్సూర్ అలీఖాన్ పటౌడితో మొదలుపెడితే వివిధ సమయాలలో రాజకీయ అరంగేట్రం చేసిన క్రికెటర్లు కొద్ది మందే ఉన్నారు. కాని ఇటీవలి సంవత్సరాలలో ఇలా రాజకీయాలలోకి ప్రవేశించే క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది.
మరి రాజకీయ పార్టీలకు క్రికెటర్ల అంటే అంత ఆకర్షణ ఎందుకు? అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి బి.కె. హరిప్రసాద్ అభిప్రాయం ప్రకారం యువతపై దృష్టితోనే రాజకీయ పార్టీలు క్రికెటర్ల పట్ల తీవ్ర ఆసక్తి ప్రదర్శిస్తుంటాయి. 'క్రికెటర్లు యువ తరానికి రోల్ మోడల్స్. వారిని లక్షలాది మంది ఆరాధిస్తుంటారు. వారి ప్రతి కదలికను జనం అత్యంత ఆసక్తితో గమనిస్తుంటారు. అందుకే వారు ఒక అస్సెట్' అని హరిప్రసాద్ పేర్కొన్నారు. మరి అజహర్ ఈ కొత్త రంగంలో విజయం సాధిస్తాడా అనేది కాలమే చెబుతుంది. కాని నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కీర్తి అజాద్, చేతన్ చౌహాన్ వంటి ఇతర క్రికెటర్లు ఇప్పటికే కాకలు తీరిన రాజకీయ నాయకులు అయ్యారు.
సిద్ధూ తొలి సంవత్సరాలలో 'స్ట్రోక్ లు కొట్టలేని' ఘనుడుగా పేరొందాడు. కాని పరిమిత ఓవర్ల క్రీడకు అనుకూలంగా తనను తాను అతను మలచుకున్న తరువాత అతను ఎంతో మెరుగుదల సాధించాడు. తన వాగ్ధాటితో, క్రీడపై వ్యాఖ్యానించడం ద్వారాను, రియాలిటీ షోలలో పాల్గొనడం ద్వారాను అతను తన సత్తాను మరింతగా ప్రదర్శించాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అమృతసర్ కు చెందిన పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని తెలిసి కూడా అతని ప్రతిభను సద్వినియోగం చేసుకొనే ఉద్దేశంతో 2007 ఉప ఎన్నికలలో అమతృసర్ నుంచి అతనిని పోటీ చేయించింది.
Pages: 1 -2- -3- News Posted: 20 February, 2009
|