కేసీఆర్ తిరకాసు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టి.ఆర్.ఎస్)అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మహాకూటమిలో భాగస్వామినన్న మాట మరచిపోయి ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటిస్తున్నారని, ఆంధ్ర ప్రాంతంవారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఈ ధోరణివల్ల పార్టీకి నష్టంకలుగుతుందని ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. కెసిఆర్ కు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు శనివారం సమీక్ష ప్రారంభించారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి వివిధ జిల్లాలనుంచి వచ్చిన పార్టీ నాయకులు టిఆరెస్ అధ్యక్షుడి వ్యవహారంపై చర్చించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోస్తా ప్రాంతంలో తెలుగుదేశం నష్టపోవలసిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
'మహా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. కాని అప్పుడే ఫలానా నియోజకవర్గం నుంచి టిఆరెస్ పోటీచేస్తుందని కెసిఆర్ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇదేం పద్ధతి?'అని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకుడొకరు ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంవారి విద్యాసంస్థలను మూసివేయిస్తానని కెసిఆర్ ప్రకటించగానే, తనను కోస్తాలో అనేకమంది నిలదీశారని, అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకుంటారా? అని సొంత పార్టీవారే అడుగుతున్నారని ఆ నాయకుడు తెలిపారు. ఇటువంటి ప్రకటనలు, పోటీ విషయంలో కెసిఆర్ సొంతంగా చేస్తున్న ప్కటనలకు అడ్డుకట్ట వేయకపోతే తమ పార్టీకి నష్టం కలుగుతుందని చంద్రబాబుకు కోస్తా నాయకులు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 22 February, 2009
|