రేసులో కాంగీ'పెద్ద'లు
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజ్యసభ కాంగ్రెస్ సభ్యులు కూడా టిక్కెట్లు అడుగుతున్నారట. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురితో సహా దాదాపు ఇరవై మంది పెద్దల సభ సభ్యులు దిగువ సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన వి.హనుమంతరావు మల్కాజ్ గిరి, జెడి శీలం బాపట్ల, టి.సుబ్బిరామి రెడ్డి విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తమ మనోగతాన్ని బయట పెట్టారని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోందని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ నాయకుల మాదిరిగానే ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు పలువురు లోక్ సభ ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరోవైపు, పార్టీ టిక్కెట్లు కోరుతున్న రాజ్యసభ సభ్యుల వ్యవహారం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి శిరోభారంగా తయారయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ రాజ్యసభ్యత్వం గడువు సంవత్సరం లేదా అంతకంటె కొంచెం ఎక్కువగా వున్న సభ్యులే లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. మరి వారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి లాభం ఏమిటి? అన్నది అధిష్టానాన్ని వేధిస్తున్న ప్రశ్న.
Pages: 1 -2- News Posted: 24 February, 2009
|