మళ్ళీ సంకీర్ణ సర్కారే గతి!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 16, మే 13 మధ్య ఐదు దశలుగా నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఎవరైనా ఒకే ఒక విషయం కచ్చితంగా చెప్పగలరు. దేశంలో పెద్దపార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండింటిలో ఏదీ 543 మంది సభ్యుల లోక్ సభలో మెజారిటీ కావలసిన 272 సీట్లను నెగ్గలేవని ఘంటాపథంగా చెప్పగలం. చివరిసారిగా ఒక పార్టీ సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ స్థానాలను గెలుచుకున్నది పాతిక సంవత్సరాల క్రితం 1984లో. కాంగ్రెస్ అప్పుడు ఆ ఘనతను సాధించింది.
1980 దశకం ద్వితీయార్ధం దరిమిలా కాంగ్రెస్ పతనం చెందగా, పూర్వపు జనసంఘ్ నుంచి ఆవిర్భవించిన బిజెపి వర్ధిల్లసాగింది. ప్రాంతీయ, భాష లేదా కుల ప్రాతిపదికపై అసంఖ్యాకంగా ఏర్పడిన చిన్న చిన్న పార్టీలు కూడా రాణించసాగాయి. 1996, 1998 మధ్య నాలుగు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అటల్ బిహారి వాజపేయి సారథ్యంలో ఏర్పడిన 13 రోజుల పాటు అధికారంలో ఉండగా, ఆతరువాత హెచ్.డి. దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వాలు, చివరకి 25 పార్టీల భాగస్వామ్యంతో వాజపేయి నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడ్డాయి.
1999లో ఏర్పడిన బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ)లో 23 భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పాటైన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లో 13 భాగస్వామ్య పక్షాలు ఉండగా ఆరు పార్టీలు వెలుపలి నుంచి మద్దతు ఇచ్చాయి. చిన్న పార్టీలపై తాము ఆధారపడవలసి వస్తున్నట్లు కాంగ్రెస్, బిజెపి రెండూ అయిష్టంగానే అంగీకరించాయి.
Pages: 1 -2- -3- News Posted: 4 March, 2009
|