బాలయ్య, రోజాలకు టిక్కెట్లు
హైదరాబాద్: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తున్న తెలుగుదేశం పార్టీ, జాబితాలను వడపోయడానికి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం. ఇందుకేసం కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పిఇసి)ని నియమించగా, అటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ తెలుగుదేశంలో కనిపించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాగా సన్నిహితులైన సహాయకులతో కలసి చంద్రబాబు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు సహకరిస్తున్నవారిలో ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలు కాదు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఖరారు కానందువల్ల,తమ పార్టీ అభ్యర్ధుల జాబితా తయారీ విషయమై చంద్రబాబు సహాయకులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను మార్చి 15న విడుదల చేసే అవకాశాలున్నాయి.
తెలుగుదేశం జాబితాలో చోటుచేసుకునే ప్రముఖులలో నందమూరి బాలకృష్ణ, ఆర్.కె.రోజా, కవిత, కాంగ్రెస్ నుండి వచ్చినవారిలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావుల పేర్లు ఉన్నాయని తెలిసింది. జిల్లాల వారీగా దేశం జాబితాలో ఉండగలవని భావిస్తున్న అభ్యర్ధుల పేర్లు: అనంతపురం: ఎన్.బాలకృష్ణ(హిందుపూర్), పి.కేశవ్(ఉరవకొండ), పి.రఘునాధరెడ్డి(పుట్టపర్తి), పరిటాల సునీత(రాప్తాడు), ఎం.శమంతకలక్ష్మి(సింగనమల). చిత్తూరు: ఎన్.చంద్రబాబు నాయుడు(కుప్పం), ఆర్.కె.రోజా(చంద్రగిరి), జి.ముద్దుకృష్ణమ నాయుడు(నగరి), బి.గోపాలకృష్ణారెడ్డి(శ్రీకాళహస్తి), ఎం.అమరనాధరెడ్డి(పలమనేరు). నెల్లూరు: ఎస్.చంద్రమోహన్ రెడ్డి(సర్వేపల్లి), కొమ్మి లక్ష్మీనాయుడు(ఆత్మకూరు), ఎన్.ప్రసన్నకుమార్ రెడ్డి(కోవూరు). ప్రకాశం: గొట్టిపాటి నరసయ్య(పర్చూరు), కె.బలరామకృష్ణ మూర్తి(దర్శి), డి.శివరాం(కందుకూరు), కె.నారాయణ రెడ్డి(మార్కాపురం), ఎం.కాశిరెడ్డి లేక కె.బాబూరావు(కనిగిరి).
Pages: 1 -2- -3- News Posted: 8 March, 2009
|