దేశం సీనియర్లు ఢిల్లీకే
హైదరాబాద్: పార్టీలోని సీనియర్లను, మాజీ మంత్రులను లోక్ సభ అభ్యర్ధులుగా ఎంపిక చేసి, జూనియర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయింనచినట్టు తెలిసింది. ఈ విషయమై పార్టీకి చెందిన కొంతమంది ముఖ్యులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిసింది. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి మళ్లీ ఎర్రన్నాయుడునే నిలబెట్టాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అనకాపల్లి నుంచి పప్పల చలపతిరావు, విజయనగరం నుంచి మాజీ మంత్రి అశోక్ గజపతి రాజులను పోటీకి పెట్టే విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే విజయనగరానికి కొండపల్లి అప్పలనాయుడును ఎంపిక చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో అశోక్ గజపతి రాజును విజయనగరం అసెంబ్లీ స్థానానికి నిలబెట్టాలని నిర్ణయించారు.
విశాఖపట్నం లోక్ సభ స్థానానికి ఎంవివిఎస్ మూర్తి కాకుండా మరో సీనియర్ నాయకుడి కోసం అన్వేషణ జరుపుతున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావును విశాఖలో నిలబెడితే ఎలా ఉంటుందన్న విషయమై జిల్లా పార్టీ నాయకులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. వీరభద్రరావు అంగీకరించక పోతే మరో కొత్త అభ్యర్ధిని అక్కడ నిలబెట్టే అవకాశం ఉంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విశాఖలో పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు అనుకుంటున్నప్పటికీ, తాను తుని అసెంబ్లీ స్థానానికే పోటీ చేస్తానని రామకృష్ణుడు చెప్పారని తెలిసింది. అయితే కనీసం కాకగనాడ లోక్ సభ స్థానానికైనా పోటీ చేయాలని ాయనపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారట!
Pages: 1 -2- -3- News Posted: 11 March, 2009
|