బుల్లెట్ ప్రూఫ్ రథాలు!
న్యూఢిల్లీ: ఎన్నికల తరుణంలో ఆటోమొబైల్ బుల్లెట్ ప్రూఫ్ పరిశ్రమకు గిరాకీ పెరిగింది. ఉగ్రవాదులు, నక్సలైట్లు, క్రూరమైన పోటీదారుల దాడుల నుండి, కాల్పుల నుండి రక్షణ కొరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పలువురు రాజకీయ నాయకులు ఎంచుకుంటున్నారు. ఈ పరిస్థితి బుల్లెట్ ప్రూఫ్ పరిశ్రమకు ఒక ఉద్దీపన ప్యాకేజి ఇచ్చినట్లుగా మారింది. ప్రమాదం పొంచి ఉన్న మారుమూల ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేసే రాజకీయ నాయకులు తమ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నారు.
టిడిపి అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు 2003 అక్టోబర్ లో మందుపాతర పేలుడు నుండి తప్పించుకోగల్గారు. ఆ తర్వాత ఆయన టైర్లతో సహా బుల్లెట్ ప్రూఫ్ చేయబడిన మూడు టాటా సఫారీలను తయారు చేయించుకున్నారు. పంజాబ్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన పర్యటించవలసిన నేపథ్యంలో ఈ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహీద్ర స్కార్పియోను ఇదే విధంగా తయారు చేయించారు. మిట్సుబిషి పెజేరస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రదోస్, ఫోర్డ్ ఎండీవర్ లతో కూడిన అయిదు స్పెషల్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యువి) ఉత్తర ప్రదేశ్ బిఎస్ పి రాజకీయ నాయకులు కొనుగోలు చేశారు. వీటన్నిటిలో బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
పంజాబ్ లో ఒక ఎండీవర్, మిట్సుబిషి మాంటెరో, నాగాలాండ్ లో రెండు మారుతి జిప్సీలకు కూడా బుల్లెట్ ప్రూఫ్ సదుపాయాలను రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా నక్సల్ ప్రభావిత చత్తీస్ గఢ్ ప్రాంతంలోని పలువురు ప్రజాప్రతినిధులు బుల్లెట్ ప్రూఫ్ సంస్థల గురించి చర్చించుకుంటున్నారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ పరిశ్రమకు చెందిన వారు తమ ఖాతాదారుల గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి ల్లాంటి జాతీయ పార్టీల నాయకులకు ప్రభుత్వం నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అందాయి. వారి వాహనాల ఆ పార్టీలకు చెందిన మరి కొంత మంది ప్రముఖులు కూడా వినియోగిస్తున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 13 March, 2009
|