కేసిఆర్ కు కొత్త సమస్యలు
హైదరాబాద్: టిఆరెస్ పార్టీలో ఇంటిపోరు ఎక్కువ అవుతోంది. ఆదినుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఎంతో మందికి పార్టీ నాయకత్వం మొండిచెయ్యి చూపే పరస్థితి కనిపించడంతో వారంతా 'తెలంగాణా వాదం' పేరిట ఇండిపెండెంట్లుగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మహాకూటమిలో భాగస్వామిగా వున్న టిఆరెస్ కు 45 అసెంబ్లీ, 9 లోక్ సభ స్థానాలకు తన అభ్యర్ధులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గత ఉప ఎన్నికల ముందు నుండి చెబుతున్న కె.చంద్రశేకరరావు, ఉప ెన్నికల్లో చావుదెబ్బ తిని, మళ్లీ ఎన్నికలకు ఏ పార్టీతోనైనా పొత్తు కుదుర్చుకోకపోతే లాభం లేదనుకున్నారు. దీంతో గతంలో టిక్కెట్లకు కెసిఆర్ నుంచి హామీ పొందినవారు తమ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
భువనగిరి నియోజకవర్గంలో పార్టీ యువజన నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి పోటీచేయాలని 2004కు ముందే ప్రయత్నించినా, పార్టీ అగ్రనేత నరేంద్ర అక్కడ పోటీచేయడంతో జిట్టాకు టిక్కెట్ లభించ లేదు. అయినా ఆయన అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని, సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీ పటిష్టతకు కృషితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ీ సారి ెన్నికల్లో జిట్టాకు టిక్కెట్ ఖాయమని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే మహాకటమి ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీకి భువనగిరి ఇప్పుడు సిట్టింగ్ సీటు. నక్సల్స్ చేతిలో హతులైన మాజీ హోం మంత్రి మాధవరెడ్డి భార్య ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల భువనగిరిని వదలుకోడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. జిట్టాకు ఎలా సర్ది చేప్పాలని కెసిఆర్ తర్జనభర్జన పడ్డారు.
Pages: 1 -2- -3- News Posted: 19 March, 2009
|