చైనా 'అలీబాబా' వస్తున్నాడు!
బీజింగ్ : చైనాలో అత్యధిక సంఖ్యాకుల నోళ్ళలో నానుతుండే, కాని ఒక పట్టాన అంతు చిక్కని, భారతీయ మీడియాతో అరుదుగా మాట్లాడుతుండే సిఇఒ తాను భారతదేశంపైన, జాతీయ ఎన్నికలపైన కన్ను వేసినట్లు చెబుతున్నారు. ఇక మీరు భారతీయ ఐటి నిపుణుడు అయినట్లయితే మీ బయోడేటా ఆయనకు పంపండి. కనీసం ఆయనైనా మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు.మీరు 44 సంవత్సరాల జాక్ మాను లేదా 'అలీబాబా'కు ఫోన్ చేయండి. చైనా నారాయణమూర్తిగా పరిగణన పొందే జాక్ మా ఇంటర్నెట్ గురించి చైనాలో అధిక సంఖ్యాకులు కనీసం విని ఉండని రోజుల్లోనే 1999లో తన అపార్ట్ మెంట్ లో 'అలీబాబా' సంస్థను స్థాపించారు.
ప్రస్తుతం చైనాలో ఆన్ లైన్ సమాజం మొత్తం అమెరికా జనాభాతో దాదాపు సమానమైనది. చైనాలో అత్యంత భారీ ఇ-వాణిజ్య సంస్థ అయిన అలీబాబాకు 30 మిలియన్ల మందికి పైగా దేశీయ వినియోగదారులు ఉన్నారు. ఒకప్పడు ఇంగ్లీష్ అధ్యాపకుడుగా ఉన్న మా అజమాయిషీలోనే 'యాహూ!చైనా' సంస్థ కూడా ఉన్నది. అయితే, చైనా వృద్ధి రేటు చరిత్రాత్మకంగా ఒక అంకె స్థాయికి మందగించినందున జాక్ మా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ తన వ్యాపార విస్తరణకు గాను వ్యూహాత్మకంగా భారతదేశంలో పరిచయంలోని లాప్ టాప్ లు, సాఫ్ట్ వేర్, స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు, సిల్క్ రోజ్ లు, చదరంగం సెట్ లు, క్యాలెండర్లు, వస్త్రాల వర్తకులతో సంబంధాలు పెట్టుకున్నారు. 2007 నుంచి 2008 వరకు ఇండియాలో అలీబాబా అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్ యూజర్ల సంఖ్య 138 శాతం పెరిగి, ఎనిమిది లక్షల స్థాయిని దాటింది. చైనాలో ఈ యూజర్ల సంఖ్య ఐదు లక్షల పైచిలుకు మాత్రమే ఉంది.
Pages: 1 -2- -3- News Posted: 22 March, 2009
|