వణకుతున్న అగ్ర నేతలు
హైదరాబాద్ : వారు ముగ్గురూ మహా నాయకులు. ఒకరేమో గతంలో కేంద్రంలో చక్రం తిప్పినవారు. మరొకరు ఎనిమిది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటున్నవారు. ఇంకొకకరు సినీ రంగాన్ని శాసించి రాజకీయ రంగాన్ని శాసించాలని ఉవ్విళ్ళూరుతున్నవారు. ఇప్పుడు ఆ ముగ్గురి గృహాలను కార్యకర్తలు దిగ్బంధించారు. తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గృహాలను, ప్రజా రాజ్యం పార్టీ (పిఆర్ పి) అధ్యక్షుడు చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు దిగ్బంధం చేశారు. నాయకులు ఇంటి నుంచి బయటకు రావడానికే జంకుతున్న స్థితి.
1.చంద్రబాబు అయితే ఇంటి నుంచి అసలు బయటకు రావడం లేదు. ఇంటిలోనే మంతనాలు సాగిస్తున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో ఎన్నో రాస్తారోకోలను నిర్వహించి అనుభవం గడించిన టిడిపి కార్యకర్తలు గత నాలుగైదు రోజులుగా ఏకంగా పార్టీ అధినేత నివాసాన్నే దిగ్బంధించారు. కుత్బుల్లాపూర్, సూర్యాపేట, మహేశ్వరం నియోజకవర్గాలలో టిడిపియే పోటీ చేయాలని ఆ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు బాబు నివాసం ముందు ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్కొండ టిక్కెట్ ను అన్నపూర్ణకు కేటాయించాలని ఆమె వర్గీయులు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన జరిపారు.
Pages: 1 -2- -3- News Posted: 29 March, 2009
|