లగడపాటికి అంతటా రగడే!
విజయవాడ: ఢిల్లీలోని కాంగ్రెస్ లాబీలో చక్రం తిప్పి తన అనుచరులకు మూడు ్సెంబ్లీ టిక్కెట్లు సాధించిన విజయవాడ ెంపి లగడపాటి రాజగోపాల్ ఈ సారి అంత సులభంగా విజయం సాధించలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడింట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు లగడపాటిని ముందుకు సాగనివ్వడం లేదు. విజయం తథ్యమని ఆయన వర్గా పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా, ప్రచార పర్వంలో జనంలో స్పందన అంతంత మాత్రంగా ఉండడం, కొన్ని గ్రామాల్లో మహిళలు ఎంపిని నిలదీస్తున్న సంఘటనలతో లగడపాటి వర్గానకి చికాకులు తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా లగడపాటి తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే కొన్ని గ్రామాల్లో మహిళలు ఆయన్ను నిలదీస్తున్నారు.
కొంతమంది మహిళలైతే ఆయనకు అడ్డుపడుతూ,'నువ్వేం చేశావు?' అని ప్రశ్నిస్తూ తిట్లు, శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ రగడను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక ఆయన సతమతమవుతున్నారు. 2004 ఎన్నికల సమయంలో పాదయాత్రలతో జనాన్ని ఆకర్షించిన లగడపాటి ఈ సారి తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది. జన రాజకీయాలకు బదులు ధన రాజకీయాన్నే ఆయన నమ్ముకున్నారని కాంగ్రెస్ లో అసమ్మతివర్గం ప్రచారం చేస్తోంది. తిరువూరు నియోజకవర్గంలోమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కుమారి బదులు పద్మజ్యోతి అనే మహిళను లగడపాటి ప్రచారంలోకి దించడం పట్ల స్థానికి కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
Pages: 1 -2- -3- News Posted: 31 March, 2009
|