తెలంగాణలో 'మహా' పోరు
హైదరాబాద్ : మహాకూటమి భాగస్వామ్య పక్షాలు - తెలుగుదేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), వామపక్షాలు - తెలంగాణ ప్రాంతంలో కనీసం 15 శాసనసభ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ నియోజకవర్గాలలో పరస్పరం తలపడనున్నాయి. ఆయన పార్టీలు ఆ నియోజకవర్గాలలో నిలబెట్టిన అభ్యర్థులలో చాలా మంది బరిలో కొనసాగుతున్నారు. ఈ నెల 16న తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు గడువు గురువారం సాయంత్రం ముగిసినప్పటికీ వారు తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు.
సికింద్రాబాద్, వరంగల్ లోక్ సభ నియోజకవర్గాలలో టిడిపి, టిఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో కొనసాగుతున్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం తలపడుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్వాన్, కూకట్ పల్లి, ఉప్పల్, పటాన్ చెరు, మహేశ్వరం, సూర్యాపేట, సంగారెడ్డి, డోర్నకల్, వరంగల్ (తూర్పు), హుజూర్ నగర్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, పరకాల, భూపాలపల్లి, మంచిర్యాల, యెల్లారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), పెద్దపల్లి, మంథని, చెన్నూరు.
టిఆర్ఎస్ కు కేటాయించిన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఆ పార్టీ నిలబెట్టిన ఎం.డి. మహమ్మద్ మహమూద్ అలీ బలహీన అభ్యర్థి అని పేర్కొంటూ టిడిపి తన అభ్యర్థిగా సుదీష్ రాంభొట్లను నిలబెట్టింది. రాంభొట్ల గురువారం సాయంత్రం 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) ప్రతినిధితో మాట్లాడుతూ, నామినేషన్ పత్రం ఉపసంహరణకు తనకు పార్టీ నుంచి ఆదేశమేదీ రాలేదని చెప్పారు. నగరంలో కార్వాన్, కూకట్ పల్లి, ఉప్పల్, మహేశ్వరం వంటి శాసనసభ నియోజకవర్గాలలో కూడా టిడిపి, టిఆర్ఎస్ పరస్పరం ఢీకొననున్నాయి. టిఆర్ఎస్ కు కేటాయించిన మహేశ్వరంలో కె. ప్రభాకరరెడ్డికి పోటీగా టిడిపి టి. కృష్ణారెడ్డిని నిలబెట్టింది. అయితే, టిడిపి కూకట్ పల్లి అభ్యర్థి పి.ఎల్. శ్రీనివాస్ పోటీ నుంచి వైదొలిగారు.
Pages: 1 -2- -3- News Posted: 3 April, 2009
|