పన్ను ఎగవేతకే పార్టీలు!
పన్ను ఎగవేతకే పార్టీలు!
న్యూఢిల్లీ : 2004 సంవత్సరంలో ఎన్నికలలో ఢిల్లీ సదర్ నియోజకవర్గంలో 126 వోట్లు వచ్చిన ప్రమోద్ తివారి దేశ ఎన్నికల చరిత్రలో స్థానం సంపాదించారు. ఆయన స్థాపించిన పరమార్థ పార్టీ ఒక్కొక్క వోటుపై తాను రూ. 2.02 లక్షలు వెచ్చించినట్లు వెల్లడించింది. దేశంలో అత్యంత ఖరీదైన వోట్లు ఇవన్నమాట. రాజకీయ పార్టీని నడపడానికి అర్హతలు ఏమీ అవసరం లేకపోవడంతోను, అనేక సదుపాయాలు లభ్యం అవుతుండడంతోను ఇటీవలి కాలంలో, ముఖ్యంగా 2003 తరువాత పెక్కు పార్టీలు పుట్టుకువచ్చాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు ఆదాయం పన్ను (ఐటి) మినహాయింపు పొందే అవకాశం 2003లో కల్పించారు. చివరకు గుర్తింపులేని, పరమార్థ పార్టీ వంటి పార్టీలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తున్నది. పరమార్థ్ పార్టీ 2003 నుంచి 2007 వరకు రూ. 2.55 కోట్లు విరాళాలు సేకరించింది. (పార్టీలు తమకు వచ్చిన విరాళాలను వెల్లడి చేస్తూ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించవలసి ఉంటుంది).
2006లో ప్రధానికి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)కి రాసిన లేఖలలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్. గోపాలస్వామి అటువంటి పార్టీల పట్ల ఆందోళన వెలిబుచ్చారు. ఆయన ఉదాహరణలుగా పరమార్థ్ పార్టీని, రాష్ట్రీయ వికాస్ పార్టీ (ఆర్ విపి)ని పేర్కొన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో పరమార్థ్ పార్టీ భారీ మొత్తాలు సేకరిస్తూ తన కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది. 2007లో అది తన పేరును 'మాత్ర భక్త పార్టీ'గా మార్చుకున్నది. ఆ పార్టీ గురించి తెలిసింది చాలా తక్కువే. తెలిసిన విషయమేమంటే అది తివారిని అభ్యర్థిగా నిలబెట్టిందని. ఆయనకు 126 వోట్లు లభించాయి. అయితే, అందుకు ఆయన భారీగానే ఖర్చు పెట్టారు.
Pages: 1 -2- -3- News Posted: 14 April, 2009
|