అంతు పట్టని ఓటరు నాడి!
తిరుపతి: చిత్తూరు జిల్లా ఓటర్ల నాడి ఈసారి ఎవరికీ అంతుపట్టడంలేదు. ముఖ్యంగా కుప్పం, తిరుపతి నియోజకవర్గాల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారో రాజకీయ పరిశీలకులు కూడా విశ్లేషించి చెప్పలేకపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం నాయకుల్లో ఉత్కంఠ నెలకొని వుంది. అభ్యర్ధులు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కుప్పంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరఫున జడ్.పి చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి బరిలో ఉన్నారు.
గతంలో చంద్రబాబు అక్కడ పార్టీ నాయకుల చేత తన నామినేషన్ వేయించి, వారిచేతనే ప్రచారం జరిపించి, అత్యధిక మెజారిటీతో గెలిచేవారు. అయితే ఈసారి ప్రజారాజ్యం పార్టీ తెరపైకి రావడంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం వచ్చి ప్రచారం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకకుండా తన కుమారుడు లోకేష్ ను, సినీ నటుడు బాలకృష్ణను కూడా ప్రచారంలోకి దించవలసి వచ్చింది.
Pages: 1 -2- -3- News Posted: 25 April, 2009
|