పీఆర్పీ చుట్టూ ప్రదక్షిణలు
హైదరాబాద్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రు వులు ఉండరన్న సత్యం మరోసారి నిజం కానుంది. ప్రధాన పార్టీలూ ఎన్నికల ప్రచారంలో పరస్పరం చేసుకున్న ఘాటైన విమర్శలన్నీ మర్చిపోయి, కొత్త బంధాల కోసం పావులు కదుపుతున్నాయి. ఫలితాల తర్వాత పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనతో ప్రధాన పార్టీలు స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తున్నాయి. మెజారిటీకి సరిపడా స్థానాలు దక్కకపోతే ఇతర పార్టీల సాయం తీసుకుందామన్న ముందస్తు వ్యూహంతో రాయబారాల్లో మునిగిపోయాయి. ఫలితాల కు ముందు నుంచీ చోటుచేసుకుంటున్న ఆసక్తికర పరిణా మాల్లో ప్రజారాజ్యం కేంద్రబిందువుగా మారింది.
16న వెలువడనున్న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఎత్తుగడల్లో బిజీగా ఉన్నా యి. రెండు పార్టీల్లోనూ విజయంపై ఎవరికి వారే ధీమాతో కనిపిస్తున్నప్పటికీ, కొత్తపార్టీ అయిన ప్రజారాజ్యం రాకతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా లేకపో లేదు. పీఆర్పీకి 30 సీట్లు మించి రావన్న విశ్వాసం అంతర్లీ నంగా రెండు పార్టీల్లోనూ ఉన్నప్పటికీ, ఒకవేళ పరిస్థితి తారుమారయి, ఆ పార్టీ 40-60 సీట్లు వస్తే పీఆర్పీ మద్దతు కీలకం అవు తుందన్న ముందుచూపుతో కాంగ్రెస్- తెలుగుదేశంపార్టీ వర్గాలు ఆ పార్టీతో మంతనాల పర్వానికి తెరలేపాయి. ఈ ప్రాధాన్యం వల్లే బహుశా పీఆర్పీ వర్గాలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా చిరంజీవి ముఖ్యమంత్రి అవడం ఖాయ మన్న ధీమాతో ఉన్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 12 May, 2009
|