రక్తపు మరకలు ఎక్కడివి?
నిడదవోలు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్యెల్యే టి.వి. రామా రావు నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో గురువారం జరి గిన ఘటనపైన, శాసనసభ్యుడి పాత్రపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని హోం మంత్రి సబితారెడ్డి శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఉదంతంలో దోషులు ఎవరైనా సరే వదలకూడదని, నిజానిజాలను వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ విభాగం సహకారంతీసుకోవాలని మంత్రి కోరారు. నర్సింగ్ కళాశాలకు చెందినవారందరిని విచారించాలని ఆమె ఆదేశించారు. ఘటనలో ఎమ్మెల్యే పాత్రపై విచారణ జరిపాకే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వివాదంలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.ఒకవేళ ఎవరైనా మహిళ నిజంగానే అత్యాచారానికి, హత్యకు గురైతే నిందితులను వదలకూడదని సబితారెడ్డి ఆదేశించారు. ఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలపై శాస్ర్తీయంగా దర్యాప్తు జరపాలన్నారు.
కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు నిర్వహణలో ఉన్న నర్సింగ్ కాలేజీలో ఓ అమ్మాయి అత్యాచారానికి గురి కావడమే కాక దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి స్థానిక ఆర్‌డిఓ, డిఎస్‌పిలు పోలీసుల సాయంతో కాలేజిలో గాలించగా ఒకచోట రక్తపు మరకలు కనిపించాయి. వాటి పక్కన పక్కనే ఉన్న నీళ్ల ట్యాంక్ వెన కాల ఎమ్యెల్యే రామారావు దాక్కుని వుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ అత్యాచారానికి, హత్యకు గురైన ఘటనలో ఆయన హస్తం ఉందని స్థాని కులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంతగా గాలించినా మహిళ శవం ఎక్కడా కనిపించలేదు. అయితే రక్తపు మర కల నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించి పరీక్షలకు పంపారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 19 June, 2009
|