మన గోవులకు అవమానం! న్యూఢిల్లీ : తమను కించపరిచారని భారతదేశ గోవులు కుమిలిపోతున్న విషయం మీకు తెలుసా?
'మాల్ దేశీ, చిత్ర విదేశీ, ఐసా నహీ హోనా చాహియే (దేశీయ ఉత్పత్తి... విదేశీ చిత్రాలు... ఇలా జరగరాదు)' అని శుక్రవారం లోక్ సభలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యుడు అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
మేఘ్వాల్ ధర్మమా అని గోవులు ఎప్పుడూ ఎందుకు మూలుగుతూ ఉంటాయో మనకు తెలియవచ్చింది. - మన దేశీయ గోవులు ఇచ్చే పాలతో ఉత్పత్తులను తయారు చేసి దేశంలోనే అమ్ముకునే సంస్థలు వాటి ప్యాకింగ్ లపై విదేశీ జాతి పశువుల బొమ్మలను ముద్రిస్తున్నాయన్నది ఆయన వాదన. ప్రభుత్వ డైయిరీలు, ప్రైవేట్ డైయిరీలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారానికి విదేశీ గోవుల చిత్రాల వాడకాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్.
రాజస్థాన్ బికనేర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేఘ్వాల్ జీరో అవర్ లో ఈ అంశం ప్రస్తావించి, భారతీయ పశువులు 'అందంలో ఏమాత్రం తీసిపోవు' అని, 'శ్రేష్ఠమైన కొమ్ములు' కలిగి ఉంటాయని చెబుతూ, ప్యాకెట్లపై వాటి చిత్రాలను ముద్రించాలని కోరారు. దేశీయ పాడి పరిశ్రమ కోసం ప్రభుత్వం కనీసం ఈ మాత్రమైనా చేయవచ్చు.
అయితే, ఈ సూచనపై వ్యాఖ్యానించడానికి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అందుబాటులో లేరు. అమూల్, నెస్లె వంటి డెయిరీ సంస్థల ప్రతినిధులు కూడా అందుబాటులో లేకపోయారు. కాని అవమానానికి గురైన ఆవులను పాలు ఇచ్చేట్లుగా ఒప్పించడంలో పరిశ్రమ అధికారులు కొందరు బిజీగా ఉండి ఉండవచ్చునని ఒక ప్రతినిధి వ్యంగ్యోక్తి విసిరారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 5 December, 2009
|