'అమర' ప్రేమ! ముంబై : దేశంలో అత్యంత అందమైన నటిగా సత్యజిత్ రే నుంచి ప్రశంసలు అందుకున్న జయప్రద సాధారణ ప్యాంటు, షర్ట్ ధరించారు. మేకప్ ఏమీ చేసుకోకపోయినప్పటికీ ఆమె మొహం కాంతిమంతంగా ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నుంచి పార్లమెంట్ సభ్యురాలైన జయప్రద పాశ్చాత్య దుస్తులలో చాలా కాలం తరువాత కనిపించారు. అయితే, ఇప్పుడు ఆమె తన మిత్రుడు, గురువు అయిన అమర్ సింగ్ తో పాటు సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) నుంచి బహిష్కృతురాలైనందున తన ఇష్టానుసారం దుస్తులు ధరించవచ్చు.
కొన్నిగంటల తరువాత విమానం ఎక్కవలసి ఉన్నప్పటికీ ఆమె చాలా ఉల్లాసంగా ఉన్నారు. అమర్ సింగ్ గురించి తప్ప మరెవరి గురించీ ఆమె మాట్లాడలేదు. 'అమర్ సింగ్ జీని సమర్థించడం మినహా నేను చేసిన తప్పేమీ లేదు. అసలు ఆయనను ఎందుకు బహిష్కరించారు? తన అనారోగ్యం కారణఁగా పార్టీ బాధ్యతల నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పడమే అందుకు కారణం. ఎంత హీనమైన కారణం అది?' అని ఆమె పేర్కొన్నారు.
అమర్ సింగ్ రాసిన బ్లాగ్ కు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం, బ్లాగ్ లు పార్టీ విధానానికి విరుద్ధమైనవని అంటూ ఆయనను అభిశంసించడం కూడా ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. ఇది సమాజ్ వాది పార్టీ అయినందున, బ్లాగింగ్, కంప్యూటర్లు సంపన్నుల కోసమే తప్ప పార్టీ సభ్యుల కోసం కాదని పార్టీ వాదించడం ఆమెకు నచ్చలేదు.
'గత ఎన్నికలలో ఓడిపోయిన వారు ములాయం నేతాజీ చుట్టూ ఉన్నారు. అందువల్ల ఆయన భద్రత గురించి భయపడుతున్నారు. అదే ఉభయుల మధ్య వివాదాంశం అయింది. కుటుంబ సభ్యులు, మిత్రులకు ముఖ్యమైన పదవులు ఇవ్వడం నేతాజీకి ఇష్టం. ఇతరులను తీసుకువచ్చి వారిని నేతలుగా తీర్చిదిద్దడం అమర్ సింగ్ జీకి ఇష్టం' అని జయప్రద చెప్పారు. తన వలెనే అనేది ఆమె మాటల ఆంతర్యం కావచ్చు.
Pages: 1 -2- -3- -4- News Posted: 5 February, 2010
|