ఫ్రిడా పింటో రహస్య వివాహం?
'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంతో ఫ్రిడా ఫింటోకు ఎంత పేరు వచ్చిందో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఎంగేజ్ మెంట్ ను నిలిపివేసి తన ఫియాన్సీ రోహన్ అనటోవ్ కు ఫ్రిడా ఉద్వాసన చెప్పిందటూ పలు వదంతులు ఇప్పటికే పుట్టుకొచ్చాయి. ఆమె గురించి ఓ కొత్త సీక్రెట్ తాజాగా బయటకు వచ్చింది. ఫ్రిడా, రోహన్ లు 2007 డిసెంబర్ లో గోవాలో రహస్య వివాహం చేసుకున్నారట.
తమ పెళ్లి విషయం చెప్పి లోఖాండ్వాలాలోని ఓ డ్రస్ డిజైనర్ కు పెళ్లి గౌను రెడీ చేయమని కూడా ఆమె అప్పట్లో పురమాయించినట్టు కూడా ఓ కథనం బయటకు వచ్చింది.
రోహన్, ఫ్రిడాలు చాలా సన్నిహితంగా ఉండేవారనీ, ఇద్దరికీ పలువురు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారనీ, 24వ పడిలో ఉన్న ఆ ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారనీ వారి సన్నిహిత మిత్రుడొకరు తెలిపారు. 'రోహన్ స్వస్థలమైన గోవాలో పెళ్లి చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. పెళ్లి కోసం ఓ హోటల్ కూడా బుక్ చేసుకున్నారు. 2007 డిసెంబర్ లో జరగాల్సిన పెళ్లిని దృష్టిలో పెట్టుకుని ఐదు రోజుల్లో డ్రస్ కుట్టి ఇవ్వాల్సిందిగా డిజైనర్ ను ఆమె కోరింది. గౌను రెడీ అయిన తర్వాత డ్రస్ వేసి చూసుకుంది. అప్పుడు ఆమె వెంట రోహన్ కూడా ఉన్నారు' అని ఆయన పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 17 February, 2009
|