సల్మాన్ తాగుడు మానేశాడు!
వినడానికి కొంచె విస్మయంగానే ఉండొచ్చు. సల్మాన్ ఫ్యామిలీ, ఆయన చిరకాల గర్లఫ్రెండ్స్ చాలాకాలంగా సాధించలేకపోయిన పనిని అమీర్ ఖాన్ సాధించి చూపించారు. సల్మాన్ ను మందుకు దూరంగా ఉండమని అమీర్ నచ్చజెప్పి ఒప్పించగలిగారు. సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న 'వీర్ ' సినిమా తరుణంలోనే ఈ ముచ్చట చోటుచేసుకుంది. అయితే సల్మాన్ పూర్తిగా మందు మానేశారా? పాక్షికంగా తగ్గించి ఉంటారా అనేది ఇప్పుడు తమాషా చర్చనీయాంశం కూడా అవుతోంది.
అమీర్, సల్మాన్ మంచి ఫ్రెండ్స్ అనీ తరచు ఒరికి ఇంటికి మరొకరు వెళ్తుంటారనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమీర్, కిరణ్ రావు కలిసి సల్మాన్ ఇంటికి డిన్నర్ కోసం వెళ్లిన ఓ సందర్భంలో సల్మాన్ తాగుడు అలావాటు గురించి సుదీర్ఘంగానే అమీర్ సంభాషించారనీ వారి కథనం. సల్మాన్ 'వీర్' చిత్రానికి సంబంధించిన ఫోటో చూసిన తర్వాతే అమీర్ కు ఈ ఫ్లాష్ లాంటి ఆలోచన తట్టిందట. 'తాగుడు అలవాటును అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే తాగుడే నిన్ను అదుపులోనికి తీసుకుంటుంది' అని అమీర్ సలహా ఇచ్చారట. సహజంగా సల్మాన్ ప్రతి రోజూ తనకెంతో ఇష్టమైన 'పాయిజన్ ' బ్రాండ్ ను ఒక బాటిల్ పైనే తీసుకుంటారు. అమీర్ తెలివితేటలను తక్కువగా అంచనా వేయలేం కదా. కనీసం 'వీర్ ' షూటింగ్ పూర్తయ్యేంతవరకైనా తాగుడుకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారట. ఆసక్తి కరంగా సల్మాన్ చివరిసారిగా గత డిసెంబర్ 27న డ్రింక్ చేశారు. అప్పటి నుంచీ మందుకు దూరంగానే ఉంటున్నారు.
Pages: 1 -2- News Posted: 21 February, 2009
|