బటన్ తీసిన ట్వింకిల్!
ముంబైః భార్య అంటే ఇష్టం లేనిదెవరకి? ఆమె పట్ల ప్రేమను చాటుకావాలంటే చాలా మార్గాలే ఉన్నాయి. కండల వీరుడు అక్షయ్ కుమార్ ఇందుకు ఎంచుకున్న మార్గం మాత్రం పలువురి చేత 'ఔరా?' అని ముక్కుమీద వేలు వేసుకునేలా చేసింది. భార్య ట్వింకిల్ పట్ల తనకున్న ప్రేమను బహిరంగంగా నలుగురిలో వ్యక్తం చేసేందుకు ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటంటే...తన జీన్స్ ఫ్యాంట్ బటన్ ను విప్పమని భార్యామణి ట్వింకిల్ ను కోరడం. ఈ ఘట్టం ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న 'లక్మే ఫ్యాషన్ వీక్' ప్రోగ్రామ్ లో చోటుచేసుకోవడం విశేషం. ఈ వ్యవహారం అక్షయ్ ను అనూహ్యంగా చిక్కుల్లోనూ నెట్టింది. సిటీ పోలీసులు దీనిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
'ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్న అక్షయ్ ఒక్కసారిగా ఆడియెన్స్ ఏరియా వైపు జంప్ చేసి నేరుగా తన భార్య వద్దకు వెళ్లారు. తన జీన్స్ బటన్ ను విప్పాల్సిందిగా కోరారు. ట్వింకిల్ మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నిరాకరించింది. చివరకి అక్షయ్ మాటకు తలవొగ్గింది' అని ప్రత్యక్ష సాక్షుల కథనం. వీక్షకులకు ఈ ఘట్టం చాలా ఉల్లాసాన్ని, ఉద్వేగాన్ని కలిగించగా, మరికొందరు మాత్రం ఇదేం వల్గారిటీ? చాలా చాలా అభ్యంతరకరం...అంటూ ముక్కులు చీదారు. అయితే అక్షయ్ మాత్రం 'నా భార్య పట్ల నాకున్న కమిట్ మెంట్ ను చాటుకునేందుకు ఇలా చేశాను' అంటూ తన చేష్టలను సమర్ధించుకున్నారు. ఇది ప్రీ-ప్లాన్డ్ గా కాకుండా అప్పటికప్పుడు అక్షయ్ మెదడులో వచ్చిన ఆలోచనకు పర్యవసానమేనట. తరుణ్ తహ్లియానీ 'లెవిస్ షో' తరఫున అక్కీ ర్యాంప్ పైకి వచ్చారు. 2008 నుంచి అక్షయ్ ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.
Pages: 1 -2- News Posted: 2 April, 2009
|