నేనా? లెస్బియనా?: నీతూ
'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?!' అన్నట్టుంది సంచలన తార నీతూచంద్ర వ్యవహారం. ఇటీవల ఏ మ్యాగజైన్ కోసం ఓ లేడీ మోడల్ తో కలిసి ఆమె అంగాంగ ప్రదర్శనలకు తెగబడి 'లెస్బియన్' షూట్ లో పాల్గొనడం కలకలం రేపింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఆరుబయటే ఈ షూట్ జరగడంతో అక్కడ బసచేసిన పలువురు ఆ యూనిట్ ను అడ్డుకున్నారు. ఆ షూట్ వేరేచోట కంటిన్యూ చేసి ఇప్పుడు మ్యాగజైన్ ను మార్కెట్ లో తెచ్చేందుకు రెడీ చేశారు. ఆ పత్రిక ప్రతులను తగులబెట్టేందుకు ముంబై ఠాక్రే సేన ఇప్పటికే పట్టుదలగా ఉంది. మరోవైపు అగ్నికి ఆజ్యం పోస్తూ నీతూచంద్ర తన 'లెస్బియన్' యాక్ట్ ను సమర్ధించుకుంటూ తొలిసారిగా నోరు విప్పింది. 'నా చర్య మగవాళ్లు ఎంజాయ్ చేయడానికే' అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.
'ఇంతవరకూ చాలా మంది చాలారకంగా మాట్లాడారు. నన్ను రకరకాలుగా పోల్చారు. లెస్బియన్ షూట్ అన్నారు. ఇప్పుడు మాట్లాడే వంతు నాది. నా ఫోటో షూట్ భారతీయ పురుషులు జీర్ణించుకోలేనంత హాట్ గా ఉండటం వల్లనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారత సినీ చరిత్రలోనే ఇలాంటి ఫోటో షూట్ ఇంతవరకూ చోటుచేసుకోలేదు' అంటూ మరో సంచలనానికి తెరతీసింది. అజంతా, ఎల్లోరా గుహల్లోని కళాఖండాలను తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు నిత్యం వస్తుంటారనీ, అలాంటి కళాత్మక దృష్టితోనే ఇద్దరు అందమైన అమ్మాయిల శరీరాలు ఒకరికొకరు తాకిస్తూ ఫోజులిస్తే ఎందుకు చూడలేకపోతున్నారని నీతూ ప్రశ్నించింది. మరో మహిళను టచ్ చేయడం ఎలాంటి అనుభూతినిచ్చిందని అడిగినప్పుడు 'షూట్ కు ముందు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఫోటో షూట్ లో ప్రతి ఫోటో వెనుక ఓ కథ ఉంది. ఎక్కడా ముద్దు ఘట్టాలు కూడా లేవు. నేను నటిని. ఒక పాత్రను పోషించిన విధంగానే ఇందులో నటించానంతే' అని సమాధానమిచ్చింది.
Pages: 1 -2- News Posted: 10 June, 2009
|