'స్వైన్ ఫ్లూ'తో 25 కోట్ల నష్టం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/bolly1.jpg' align='center' alt='Kameene, Love aj kal'>
మల్టీప్లెక్స్ యాజమాన్యాలకూ, నిర్మాతలకూ మధ్య తలెత్తిన వివాదం ఏప్రిల్, మే మాసాల్లో బాలీవుడ్ పరిశ్రమకు కోట్లలో నష్టాన్ని మిగిలిస్తే, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పుడు 'స్వైన్ ఫ్లూ' ప్రభావం సినిమా బిజినెస్ ను అతలాకుతలం చేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న 'స్లైన్ ఫ్లూ'ను దృష్టిలో పెట్టుకుని ఈనెల 16వ తేదీ వరకూ ముంబైలోని అన్ని మల్టీప్లెక్స్ లు, థియేటర్లు మూసివేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిది. దీంతో జన్మాష్టమి, స్వాతంత్ర్య దినోత్సవం వంటి హాలిడేస్ తో కూడిన వారాంతంలో భారీగా బిజినెస్ కోల్పోయే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇది సుమారు 25 కోట్ల రూపాయలకు వరకూ ఉండబోతోంది.
ప్రభుత్వ ఆదేశాలతో ముంబైలో థియేటర్లు మూతపడినప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కమీనే' (షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంట), 'లైఫ్ పార్టనర్' చిత్రాలు ముంబై మినహా దేశవ్యాప్తంగా ఈనెల 14న యథాప్రకారం విడుదలవుతున్నాయి. గతవారమే విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతున్న 'లవ్ ఆజ్ కల్' (సైఫ్ అలీఖాన్ - దీపిక పడుకొనే) సైతం మల్టీప్లెక్స్ లు, ఇతర ప్రధాన సెంట్లర్లు మూతపడటంతో వారాంతంలో గణనీయమైన బిజినెస్ కోల్పోనుంది. ముంబై రిజీయన్ లో థియేటర్లు మూతపడినప్పటికీ ముందుగా అనుకున్న విధంగానే 'కమీనే' చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు (యూటీవీ) స్పష్టం చేశారు. పుణెలో 10 థేయేటర్లు మూసివేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దేశవ్యాప్తంగా వారంరోజులకు వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్ల వాటాలో 25 శాతం ముంబైలోని 30కి పైగా ఉన్న మల్టీప్లెక్స్ ల నుంచే వస్తుంది. ఇవన్నీ వారాంతలో మూతపడటం వల్ల బాలీవుడ్ బిజినెస్ కు పెద్ద దెబ్బగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 13 August, 2009
|