పిల్లలంటే విసుగు: రాఖీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rakhisawant.jpg' align='right' alt=''>'స్వయంవరం' సాక్షిగా పెళ్లిచూపులు, నచ్చిన వరుడిని ఎంచుకోవడం, సంప్రదాయ రీతిలో ఎంగేజ్ మెంట్...ఇలా 'రాఖీ కా స్వయంవరం' రియాల్టీ షోతో తన మనసుకు నచ్చిన కెనడా బిజినెస్ మన్ ఎలేష్ పరుజున్ వాలాను తన సొంతం చేసుకున్న రాఖీ సావంత్ ఇప్పుడు క్రమంగా భారతనారీమణి ఇమేజ్ కు దూరమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు మళ్లీ ఎన్టీటీవీ ఇమేజన్ లోనే సెకెండ్ రియాల్టీ షో కోసం రాఖీ సిద్ధమవుతోంది. 'పతి పత్ని ఔర్ వో' అనే ఈ కొత్త షోలో రాఖీ-ఎలేస్ అమ్మానాన్నలుగా నటించబోతున్నారు. రాఖీ ఎనిమిది నెలల గర్భవతిగా, పుట్టిన బిడ్డ యుక్తవయస్సు వచ్చేవరకూ సాకే తల్లిగా ఇందులో కనిపించబోతోంది. మరి పిల్లలపై రాఖీకి ఎలాంటి మక్కువ ఉంది? 'పిల్లలా...చచ్చేడంత బోర్' అంటోంది రాఖీ. ఎలేష్ తో పెళ్లెప్పుడు అని అడిగితే 'బాగా డబ్బులు సంపాదించి ఎలేష్ నిలదొక్కుకున్నప్పుడే' అంటూ కుండబద్ధలు కొడుతోంది.
'నాకు మైగ్రేన్ సమస్య ఉంది. పిల్లలు ఏడిస్తే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. రియాల్టీ షో కోసం నెలరోజుల పాటు పిల్లలతో ఎలా గడుపుతానో నాకే తెలియడం లేదు. తొలిసారి మేకప్ లేకుండా కూడా నటించబోతున్నాను' అని రాఖీ తెలిపింది. సొంత పిల్లలు పుడితే వారిని ఎలా సాకుతాననేది కూడా తనకు తెలియదనీ, బహుశా పూర్తిగా తాను సహనం కోల్పోవచ్చనీ, రాఖీ మంచి అమ్మాయి అనుకునేవారు అప్పుడు తన నిజస్వరూపం తెలుసుకుంటారనీ నవ్వుతూ చెప్పింది.
Pages: 1 -2- News Posted: 19 August, 2009
|