దీపిక-రణ్ బీర్ కటీఫ్?
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Deepika-ranbir.jpg' align='right' alt=''>దీపికపడుకునే, రణ్ బీర్ మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఆ ప్రేమజంట విడిపోవడం కొద్దికాలంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఇద్దరూ విడిపోవడానికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఇద్దరూ ఎవరి దారి వారు ఎంచుకోవడానికి అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు బయటకు వచ్చింది.
దీపక-రణ్ బీర్ ల ప్రేమకు కత్రినా కైఫ్ చిచ్చుపెట్టిందనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. కత్రినను ఈ విషయంలో తప్పుపట్టడం తొందరపాటే అయినప్పటికీ ఆమె రంగప్రవేశంతోనే దీపికలో అభద్రతా భావం చోటుచేసుకుందట. కపూర్ ఫ్యామిలీలో రణ్ బీర్ యువకుడు, అందగాడు కూడా కావడంతో లేడీస్ అట్రాక్ట్ కావడం సహజ ప్రక్రియే. అయితే ఈ విషయంలో ఇంకా రణ్ బీర్ అంత ముదురు కాదట. అయినప్పటికీ రణ్ బీర్ గురించి దీపిక స్నేహితులు చిలువలు పలువలు వేసి దీపికకు చెప్పారట. దీనిపై అమీతుమీ తేల్చుకోవాలని భావించిన దీపిక ఆతని పద్దతులు మార్చుకోవాలనీ, ఇద్దరి అనుబంధం కోసం తాను చాలా వదులుకున్నాననీ చెప్పిందట. నిహార్ పాండ్య, యవరాజ్ సింగ్ వంటి వారితో ఉన్న తనకున్న 'మంచి స్నేహం' కూడా వదులుకున్నట్టు ఉదహరించిందట. నందిత మహంతితో సహా పలువురు అమ్మాయిలతో రణ్ బీర్ కు ఉన్నట్టు తెలుస్తున్న ఫ్రెండ్ షిప్ ను పూర్తిగా వదులుకోవాలనే షరతు కూడా విధించిందట. ఇది సహజంగానే రణ్ బీర్ ను ఆలోచనలో పడేసిందనీ, తన వ్యక్తిగతానికి అడ్డుపడటం సబబు కాదని చెప్పాడనీ అంటున్నారు. ఇద్దరూ జంట కావాలనుకున్నప్పుడు వ్యక్తిగతం ప్రశ్నే లేదని దీపిక తెల్చిచెప్పినట్టు సమాచారం. కత్రినకు రణ్ బీర్ దగ్గరవుతున్నాడనే సమాచారం ఈ ప్రేమజంట మధ్య ఆగాధం ఏర్పడానికి చివరి ఘట్టమైంది.
Pages: 1 -2- News Posted: 4 November, 2009
|