'మమ్మీకి ఆ సీన్ చూపొద్దు'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kurbaan1.jpg' align='right' alt=''>కరీనా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ సైఫ్ అలీఖాన్ కు వేడిపుట్టించే విధంగా 'కుర్బాన్'లో వీపునగ్నంగా చూపించే సన్నివేశం కొద్దికాలంగా 'హాట్' టాపిక్ అయి కూర్చుంది. మంబైలోని శివ సైనికులు (శివసేన) ఆందోళనలకు కూడా దిగారు. కరీనా వీపు కనిపించే బ్యానర్లకు చీరలు చుట్టారు. మహారాష్ట్రియన్ చీరను కట్టుకుని పబ్లిక్ లో తిరగమంటూ ఓ చీరను కూడా ఆమె ఇంటికి పంపారు. కరీనా మాత్రం ఇదేమంత పెద్దవిషయం కాదన్నట్టు ఇంతవరకూ గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. నేషనల్ టెలివిజన్ లో ఇటీవల ప్రసారమైన 'డేట్ విత్ కుర్బాన్' అనే షోలో చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సూటిగా కరీనాకు ఓ ప్రశ్నాస్త్రం సంధించారు. ఇంతవరకూ ఆమె నటించిన చిత్రాల్లో ఏ హీరోతోనైనా ఇంతిలా 'రెచ్చగొట్టే' సన్నివేశంలో నటించిందీ లేదనీ నిర్మొహమాటంగా చెప్పమని ఆయన అడిగారు. 'చేసే ఉండొచ్చు. అయితే వాటికంటే ఇప్పుడే ఆ ఘాటు కనిపిస్తుంది' అంటూ కరీనా సమాధానమిచ్చింది.
స్క్రిప్టులో అంతర్భాగమైన కీలక సన్నివేశం కావడంతోనే తాను చేయడానికి అంగీకరించాననీ, దర్శకుడు కళాత్మకంగా చిత్రీకరించడం తనకు చాలా సంతోషంగా ఉందనీ చెప్పుకొచ్చింది. సైఫ్ నిజజీవితంలోనూ తనకు బాగా దగ్గరవాడు కాబట్టి మరింత సునాయాసంగా సన్నివేశాన్ని రక్తికట్టించామనీ, ఇవన్నీ కాకుండా తానూ, సైఫ్ వృత్తిలో ప్రొఫెషనల్స్ కావడం, స్క్రిప్టు డిమాండే చేయడం కూడా ఇందుకు ప్రధాన కారణాలనీ పేర్కొంది. ఇవన్నీ చూసినప్పుడు కరీనాకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదనే అనిపిస్తుంది. అయితే ఇందుకు భిన్నమైన వైఖరిని కరీనా ప్రదర్శించడమే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్.
Pages: 1 -2- News Posted: 17 November, 2009
|