ఖతర్నాక్ కత్రినా!
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/manisha-katrina.jpg' align='right' alt='katrina-manisha'>ఖాట్మండు: వెటరన్ బాలీవుడ్ స్టార్ మనీషా కొయిరాలా రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ నేపాలి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నేపాలీ ఇండస్ట్రీ నుంచే అప్పట్లో మనీషా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇన్నేళ్ల తర్వాత నేపాలి ఇండస్ట్రీలోకి మనీషా అడుగుపెట్టినప్పటికీ బాలీవుడ్ హాట్ పేవరెట్ కత్రినా 'పాలిటిక్స్'కు తలొగ్గక తప్పలేదు.
విషయానికి వస్తే...కత్రినా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రకాష్ ఝా 'రాజ్ నీతి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్ఫూర్తితో కత్రిన పాత్రను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరంగా మనీషా నేపాలీలో నటిస్తున్న రెండవ చిత్రం కూడా ఇదే టైటిల్ తో నిర్మాణం జరుపుకొంది. 1989 తర్వాత నేపాలీ భాషలో మనీషా నటించడం ఇదే ప్రథమం. ఒకే టైటిల్ తో రెండు చిత్రాలు విడుదలైతే ఏర్పడే గందరగోళాన్ని నివారించేందుకు మనీషా చిత్రం టైటిల్ ను ఎట్టకేలకు 'ధర్మ'గా మార్చారు. ఆ చిత్ర దర్శకుడు దీపేంద్ర ఖనల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 'కత్రినా, మనీషా చిత్రాలు ఇంచుమించు ఏక కాలంలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే టైటిల్ ఒకటే కావడం వల్ల ఏది నేపాలి చిత్రమో, ఏది ఇండియన్ పాలిటిక్స్ తో ముడిపడిన చిత్రమో తెలియక ప్రజల్లో అయోమయం నెలకొనే అవకాశముంది. దీనిని నివారించేందుకు మా చిత్రానికి టైటిల్ మార్చాలని నిశ్చయించాం' అని ఆయన వివరణ ఇచ్చారు. 'ధర్మ' చిత్రాన్ని పూర్తి కమర్షియల్ చిత్రంగా దీపేంద్ర తెరకెక్కించారు. నేపాలీ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అనిపించుకుంటున్న రాజేష్ హమాల్ కు జోడిగా మనీషా ఈ చిత్రంలో నటిస్తోంది.
Pages: 1 -2- News Posted: 24 February, 2010
|