'రాజు'ను మేనేజ్ చేశారా?
రాజుల వద్ద గల డాక్యుమెంట్లలో వారితో రాజకీయ సంబంధాలు ఉన్నట్లు తెలిపే సమాచారం ఏదైనా ఉంటే ఎన్నికల ముందు రాజకీయంగా ఇరకాట స్థితి ఎదురవుతుందని రాజకీయ బాసులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 'రాజకీయ సంబంధాల ఉన్నట్లుగా ఈ రికార్డులలో ఏమీ వెల్లడి కాలేదని, ఒక వేళ అటువంటి ఆధారాలు ఏవైనా ఉన్నా రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాటిని రాష్ట్ర పోలీసులు తమ వద్ద పదిలంగా అట్టిపెట్టుకున్నారని మాకు తెలుస్తున్నది. అందువల్ల, ఒక స్థాయికి మించి రాజు లను కాపాడవలసిన ఆవశ్యకత రాష్ట్రానికి లేదనిపిస్తున్నది' అని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. వాస్తవానికి రాజు సోదరులను అరెస్టు చేసిన వెంటనే రాజు కులస్థులు సంఘటితమై ప్రభుత్వంపై తమ ఆగ్రహం వెళ్ళగక్కారు.
రాజు సోదరుల అరెస్టు ప్రభావం, రాజకీయ పర్యవసానాల గురించి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి వివరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. రాష్ట్ర జనాభాలో రాజులు కేవలం 1.2 శాతం ఉన్నప్పటికీ వారి ప్రాబల్యం అధికంగానే ఉన్నది. క్షత్రియులలో ఈ వర్గం వారు వ్యవసాయ పద్ధతుల ద్వారాను, కోస్తా ఆంధ్రలో తమ అజమాయిషీలో ఉన్న సాగు భూములు ద్వారాను సంపన్నులు అయ్యారు.
ఈ కులస్థులు ఉభయ గోదావరి జిల్లాలలోనే ఎక్కువగా కేంద్రీకృతమైనప్పటికీ కొందరు వ్యాపారాలు, పిల్లల చదవుల కోసం హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. రాజు కులస్థులు రాజకీయంగా పలుకుబడి కలిగి ఉన్నారు. వారి మాటకు ఆ రెండు జిల్లాలలో ఎంతో విలువ ఉంది. చిరంజీవి కొత్తగా ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ (పిఆర్ పి) కూడా ఎన్నికలలో ఆ రెండు జిల్లాలపైనే దృష్టిని కేంద్రీకరించడం గమనార్హం.
Pages: -1- 2 -3- News Posted: 10 February, 2009
|