'రాజు'ను మేనేజ్ చేశారా?
'ఈ మొత్తం వ్యవహారం నుంచి తెలుగు దేశం పార్టీ లబ్ధి పొందకుండా చూడడమే కాంగ్రెస్ ధ్యేయం. సత్యం కుంభకోణం పర్యవసానంగా ప్రజారాజ్యం కొన్ని సీట్లు గెలుచుకున్నా పెద్దగా బాధ ఉండదు' అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అయితే, కేంద్ర అధికారుల నుంచి రాజులకు రాష్ట్రం రక్షణ కల్పిస్తున్నదనే వార్తలు ఒక విధంగా ఆ కులస్థులకు ప్రభుత్వంపై గల అభిప్రాయం మారడానికి దోహదం చేసింది. 'ఈ దశలో సత్యం అరెస్టుల వల్ల రాజకీయంగా రాజుల వర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వోట్లు పడినా అవి చిరంజీవి ఖాతాలోకే వెళతాయి కాని చంద్రబాబు నాయుడుకు కాదు' అని ఆ ప్రతినిధి వివరించారు.
వాస్తవానికి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రికి గాని, ఆయన కుమారునికి గాని వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేయకుండా చూసేందుకు రాజులపై సిఒడి ఒత్తిడి వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఉదాహరణకు, ఈ కేసులో కొంతకాలంగా కొత్త అరెస్టులేవీ లేవు. ఈ కేసులో ప్రశ్నించిన వ్యక్తుల డాక్యుమెంట్లలో రామలింగరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, తల్లి అప్పల నరసమ్మ వంటి వ్యక్తుల పేర్ల ప్రస్తావన ఉన్నప్పటికీ సిఐడి వారి అరెస్టుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. సూర్యనారాయణ రాజు పరారీలో ఉన్నట్లు సిఐడి అధికారులు ఇప్పటికీ చెబుతున్నారు. సూర్యనారాయణ రాజు ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనపై విచారణ ఇంకా మొదలు కావలసి ఉంది.
రామలింగ రాజు తల్లి, సోదరుడు, భార్య నందిని పేర్లను ఆయనను నియంత్రించడానికి ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న వెటరన్లు చెబుతున్నారు. 'ఎస్ఆర్ఎస్ఆర్ అడ్విజరీ సర్వీసెస్ జనరల్ మేనేజర్ డివిజికె రాజు వంటి వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా దర్యాప్తు సిబ్బంది అరెస్టులపై స్పష్టమైన సంకేతాలను పంపారు. ఇప్పుడు తన భార్యను లేదా తల్లిని అరెస్టు చేస్తారనే భావనే రాజును భయాందేళనలకు గురి చేయగలదు' అని రిటైరైన సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
Pages: -1- -2- 3 News Posted: 10 February, 2009
|