ఆవు పంచితంతో 'కోలా'!
ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న కోలా డ్రింక్ లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయంటూ పరీక్షలలో నిర్ధారణ అయినప్పటికీ జనం వాటిని ఎగబడి తాగుతూ లేని రోగాలను కొనుతెచ్చుకుంటున్నారు. కాని ఆవు పంచితంతో తయారయ్యే డ్రింక్ ప్రకృతి సిద్ధమైనది, రోగ నివారిణి కూడా. ఈ డ్రింక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మన సంస్కృతి, సంప్రదాయాలలో గోవును ఎందుకు అంతగా పూజిస్తామో కూడా బాహ్య ప్రపంచానికి ఇంకా బాగా అర్థం అవుతుందని ప్రకాష్ అన్నారు.
గోవు పంచితం ప్రాముఖ్యాన్ని ప్రజలలో ప్రచారం చేయడం ఆర్.ఎస్.ఎస్. ప్రాధాన్యతాంశాలలో ఒకటి. సంఘ్ నిర్వహించే ప్రతి సమావేశంలోను, సభల్లోను ఆవు పంచితంలో ఉన్న ఔషదీయ గుణాలను వివరిస్తూ కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తుంటాం అని ఓం ప్రకాష్ వెల్లడించారు. గోపరిరక్షణ, గోపంచితం ప్రాముఖ్యతను ప్రచారం చేసే ఉద్యమంలో ప్రకాష్ ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా పాలుపంచుకుంటున్నారు. గోమూత్రం ఉపయోగించి ఇప్పటికే టూత్ పేస్ట్ లు, షాంపూలు, సబ్బులు, ఫేస్ పౌడర్, బిస్కట్లు, అగర్ బత్తీలు, ఫినాయిల్ వంటి ఉత్పాదనలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆవు పేడతో తయారు చేసిన టైల్స్ ఉపయోగించడం ద్వారా అగ్ని ప్రమాదాలు, వర్షా కాలంలో లీకేజీలు అరికట్టడంతోపాటు రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చునని ప్రకాష్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 10 February, 2009
|